Home తాజా వార్తలు శివంలో ఉచిత శిక్షణ తరగతులు

శివంలో ఉచిత శిక్షణ తరగతులు

Free Computer Training For Unemployed

హైదరాబాద్: శ్రీసత్యసాయి సేవా సంస్థలు, శివం ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 12వ తేదీ నుంచి పలు ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు.  డిగ్రీ చదివిన నిరుద్యోగ యువకులకు గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సు, వ్యక్తిత్వ వికాసం, కోరల్‌డ్రా, ఫొటోషాప్ తదితర వాటిల్లో ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్టు  తెలిపారు. 40 రోజులపాటు సాగే ఈ శిక్షణకు ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుందన్నారు. కేవలం బాలురకు మాత్రమే ఈ అవకాశమని, 25ఏండ్లలోపు కలిగి ఉండి, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందని, ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ ఈ నెల 11వ తేదీ ఉదయం 9 గంటలకు శివంలో ఉంటుందని, ఆసక్తి గల వారు ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ వివరాలకు ఈ నంబర్లకు 9010632555, 9493414060, 9848487440  సంప్రదించాలని కోరారు.