Home జయశంకర్ భూపాలపల్లి మేడారం భక్తులకు బిఎస్‌ఎన్‌ఎల్ ఉచిత వైఫై

మేడారం భక్తులకు బిఎస్‌ఎన్‌ఎల్ ఉచిత వైఫై

Medaram-BSNL

జయశంకర్ భూపాలపల్లి: మేడారం జాతర కోసం బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ విస్తృత ఏర్పాట్లు చేసింది. బిఎస్‌ఎన్‌ఎల్ సేవల వివరాలను పిజిఎం నరేంద్ర పలు మీడియా సంస్థల ద్వారా వెల్లడించారు. వరంగల్ నుంచి మేడారం వరకు 22 టవర్ల ద్వారా 2జి,3జి, 4జి సేవలు అందిస్తామని తెలిపారు. మేడారంలో ప్రత్యేకంగా 17 తాత్కాలిక టవర్లు ఏర్పాటు చేశామని, సిసిటివి కెమెరాల పర్యవేక్షణ కోసం ప్రభుత్వానికి ప్రత్యేక లీజ్‌లైన్ సేవలను ఇస్తున్నామని పేర్కొన్నారు. ఎన్‌పిడిసిఎల్, మీడియా కోసం ప్రత్యేక లీజ్‌లైన్ సేవలు వినియోగిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ సౌజన్యంతో భక్తులందరికీ వైఫై సేవలు అందిస్తామన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్ సహా ఇతర ఆపరేటర్ల వినియోగదారులందరికీ వైఫై సేవలు ఇస్తామని, వైఫై సేవల కోసం 20 హాట్ స్పాట్‌లు, 80 యాక్సెస్ పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. వినియోగదారుడు రోజుకీ 500 ఎంబిపిఎస్ వరకు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పిస్తామన్నారు. భద్రత కోసం ట్రాయ్ నిబంధన ప్రకారం ఒటిపి ద్వారా వైఫై సేవలు విస్తరిస్తున్నామని, ఒకేసారి 20 వేల మంది, 24 గంటల్లో 3 లక్షల మంది వైఫై సేవలు వినియోగించుకోవచ్చని వెల్లడించారు. రోజుకీ మూడు లక్షల మంది వైఫై సేవలు వినియోగించుకునేలా పరికరాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు మేడారం పరిధిలో వైఫై సేవలుంటాయని వివరించారు.