Home తాజా వార్తలు సెమీస్‌లో కీస్, థీమ్

సెమీస్‌లో కీస్, థీమ్

sprt

జ్వరెవ్ ఔట్, స్టీఫెన్స్, ముందుకు, ఫ్రెంచ్ ఓపెన్

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో అమెరికా తారలు మాడిసన్ కీస్, స్లొవానె స్టీఫెన్స్ సెమీఫైనల్‌కు చేరుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్, జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వరెవ్ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. ఆస్ట్రియా ఆటగాడు, ఏడో సీడ్ డొమినిక్ థీమ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. థీమ్ 64, 62, 61 తేడాతో జర్మనీ స్టార్‌ను చిత్తు చేశాడు. జ్వరెవ్‌తో జరిగిన పోరులో థీమ్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. దూకుడుగా ఆడుతూ ముందుకు సాగాడు. ప్రారంభం నుంచే జ్వరెవ్ ఒత్తిడిలో కనిపించాడు. క్వార్టర్ ఫైనల్ వరకు చేరడంలో తీవ్రంగా పోరాడిన జ్వరెవ్ ఈ మ్యాచ్‌లో మాత్రం ఏమాత్రం ప్రతిఘటన ఇవ్వకుండానే చేతులెత్తేశాడు. థీమ్ అద్భుత ఆటతో జ్వరెవ్‌ను హడలెత్తించాడు. తనకు మాత్రమే ప్రత్యేకమైన షాట్లతో జ్వరెవ్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. మరోవైపు జ్వరెవ్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఇదే సమయంలో వరుస తప్పిదాలకు పాల్పడ్డాడు. తొలి సెట్‌లో కాస్త మెరుగ్గానే ఆడిన ఒత్తిడికి గురవ్వడంతో ఇబ్బందులు తప్పలేదు. దూకుడుగా ఆడిన థీమ్ వరుసగా మూడు సెట్లను గెలిచి సెమీఫైనల్‌కు చేరుకున్నాడు.
స్టీఫెన్స్ అలవోకగా…

మరో క్వార్టర్ ఫైనల్లో అమెరికాకే చెందిన పదో సీడ్ స్టీఫెన్స్ జయకేతనం ఎగుర వేసింది. రష్యా క్రీడాకారిణి డారియా కసట్కినాతో జరిగిన పోరులో స్టీఫెన్స్ 63, 61 తేడాతో విజయం సాధించింది. ప్రారంభం నుంచే స్టీఫెన్స్ హవా నడిచింది. కళ్లు చెదిరే షాట్లతో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టింది. స్టీఫెన్స్ చెలరేగి ఆడడంతో కసట్కినా కనీస ప్రతి ఘటన కూడా ఇవ్వలేక పోయింది. తొలి సెట్‌లో కేవలం మూడు గేమ్‌లను మాత్రమే సాధించింది. చివరి వరకు దూకుడుగా ఆడిన స్టీఫెన్స్ సునాయాసంగా తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక, రెండో సెట్‌లో మరింత దూకుడును ప్రదర్శించింది. అసాధారణ ఆటను కనబరిచిన స్టీఫెన్స్ ఏమాత్రం ప్రతిఘటన లేకుండా సెట్‌ను గెలిచి సెమీస్‌కు చేరుకుంది. అంతకుముందు మూడో సీడ్ గార్బియన్ ముగురుజ(స్పెయిన్), లెసియా సురెంకో మధ్య జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్ పోరు అర్ధాంతరంగా ముగిసింది. గాయం వల్ల సురెంకో మధ్యలోనే తప్పుకోవడంతో ముగురుజ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్స్‌లో ముగురుజ రష్యా స్టార్ మారియా షరపోవాతో తలపడుతుంది.
జొకొవిచ్ ఇంటికి…

jokovich
మరోవైపు మాజీ చాంపియన్ నొవాక్ జొకొవిచ్ (సెర్బియా) క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. ఇటలీ ఆటగాడు మార్కొ సెచ్చినాటో హోరాహోరీ సమరంలో 20వ సీడ్ జొకొవిచ్‌ను మట్టికరిపించాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన సమరంలో మార్కొ 63, 76, 16, 76తో జొకొవిచ్‌ను ఓడించి సెమీస్‌కు చేరుకున్నాడు. ప్రారంభం నుంచే మార్కొ దూకుడుగా ఆడాడు. చక్కని షాట్లతో జొకొవిచ్‌ను నిలువరించాడు. ఇదే సమయంలో సులువుగా తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్‌లో మాత్రం జొకొవిచ్ ప్రత్యర్థికి గట్టి పోటీ ని ఇచ్చాడు. అయితే టైబ్రేకర్ వరకు వెళ్లిన పోరులో మార్కొ విజ యం సాధించాడు. కానీ, కీలకమైన నాలుగో సెట్‌లో జొకొవిచ్ పైచే యి సాధించాడు. చెలరేగి ఆడిన జొకొవిచ్ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే నాలుగో సెట్‌లో మార్కొ పుంజుకున్నాడు. హోరాహోరీగా సాగిన పోరులో విజయం సాధించి ముందంజ వేశాడు.

చెమటోడ్చిన కీస్..

madison
మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 13వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) చెమటోడ్చి విజయం సాధిం చింది. రష్యా క్రీడాకారిణి యూలియా పుతిన్‌సేవాతో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో మాడిసన్ 76, 64 తేడాతో జయభేరి మోగించింది. ప్రారంభం నుంచే ఇద్దరు నువ్వానేనా అన్నట్టు పోరాడారు. దీంతో ప్రతి గేమ్‌లోనూ ఉత్కంఠ పోరు తప్పలేదు. యూలియా దూకుడుగా ఆడుతూ మాడిసన్‌ను ముప్పుతిప్పలు పెట్టింది. మాడిసన్ కూడా పట్టువదల కుండా పోరాడుతూ ముందుకు సాగింది. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో తొలి సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లక తప్పలేదు. ఇందులో కూడా పోటీ హోరాహోరీగానే నడిచింది. అయితే చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడు కోవడంలో సఫలమైన మాడిసన్ సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్ ప్రారం భంలో కూడా యూలియా గట్టిగానే పోరాడింది. కీస్‌ను హడలెత్తిస్తూ ముందుకు సాగింది. మరోవైపు కీలక దశలో కీస్ మళ్లీ పుంజుకుంది. ప్రత్యర్థి ఆధిక్యాన్ని అడ్డుకుంటూ లక్షం దిశగా అడుగులు వేసింది. చివరి వరకు నిలకడైన ఆటతో యూలియాను కంగుతినిపించి సెమీఫైనల్‌కు చేరుకుంది.