Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

వ్యోమగాములకు తాజా ఆహారం

Greenhouse for Astronauts

అంతరిక్షంలో నెలల తరబడి పరిశోధనలు సాగించే వ్యోమగాములకు ఇకనుంచి తాజా ఆహారం దొరకనుంది.  తాగునీరు, ఆమ్లజని, ఆహారంలాంటి కనీస అవసరాల కొరతకు చెక్ పెట్టనుంది నాసా.

వారికి కావల్సిన ఆహారాన్ని వారి చెంతే ఉత్పత్తి చేసే సరికొత్త హరిత పందిరిని (గ్రీన్ హౌస్) నాసా శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రస్తుతం నమూనా దశలో ఉంది.

దీన్ని మరింత అభివృద్ధి పరిచి చంద్రుడు, అంగారకుడిపై వినియోగానికి అనుకూలంగా తీర్చిదిద్దనున్నారు. ఈ గ్రీన్‌హౌస్‌లో పోషకాలు నిండిన ఆహార పంటలను, మొక్కలను సాగుచేయవచ్చు.

అంతేకాకుండా ఒకచోట నుండి మరోచోటికి తరలించడానికి అనువైనది.  వ్యోమగాములు శ్వాస ద్వారా వదిలే కార్బన్‌డయాక్సైడ్‌ను ఈ మొక్కలు సంగ్రహించి, కిరణజన్యసంయోగక్రియ ద్వారా ఆమ్లజనిని ఉత్పత్తి చేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.  ఇప్పటికే అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో  కూరగాయల సాగు పరీక్షలు విజయవంతమయ్యాయి.

– మల్లీశ్వరి వారణాసి

Comments

comments