Home పెద్దపల్లి పత్తి పాక కోసం తాజా,మాజీల పోరు

పత్తి పాక కోసం తాజా,మాజీల పోరు

Fresh, former fighting for cotton culinary
పెద్దపల్లి: పెద్దపల్లి నియోజక వర్గ భవితవ్యాన్ని నిర్ణయించే పత్తిపాక రిజర్వాయర్ కు ఎన్నికలలోపు శంకుస్థాపన చేయించి తన సత్తా చాటుకోవాలని పెద్దపల్లి ఎంఎల్ఎ దాసరి మనోహర్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. పత్తపాక ఇప్పట్లో శంకుస్థాపనకు నోచుకోదని, ఒకవేళ శంకుస్థాపన జరిగిన అది తమ పోరాట ఫలితమేనని ప్రచారం చేసుకునేందుకు మాజీ ఎంఎల్ఎ విజయ రమణ రావు పావులు కదుపుతున్నారు. గత ఆరు నెలల నుండి ప్రస్తుతం ఉన్న ఎంఎల్ఎ, మాజీ ఎంఎల్ఎ పత్తిపాక రిజర్వాయర్ కోసం మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ప్రస్తుతం పెద్దపల్లి నియోజక వర్గ రాజకీయాలన్ని పత్తిపాక రిజర్వాయర్ చుట్టే తిరుగుతున్నాయి. పత్తిపాక రిజర్వాయర్ పూర్తయితే పెద్దపల్లి నియోజకవర్గంలోని టేలెండ్ ప్రాంతాలయిన కాల్వ శ్రీరాంపూర్, ఒదెల మండలాలలోని ఆయకట్టు పరిధిలో రెండు పంటలకు నీరందడంతో పాటు తాగు నీటికి డోకా ఉండదు. ఈ నెల 11 న సుందిళ్ల బ్యారేజి పనులను పరిశీలించేందుకు వచ్చిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మత్రి హరీష్ రావును కలిసిన దాసరి పత్తిపాక రిజర్వాయర్‌తో పాటు వరుద కాలువ ద్వారా కాకతీయ కెనాల్‌కు ఎల్లంపల్లి నీటిని అనుసందానం చేసే ఉపకాలువ పనులను సైతం వెంటనే చేపట్టి పెద్దపల్లి నియోజక వర్గంలోని ఆయకట్టును రక్షించాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించడంతో టిఆర్‌ఎస్ నాయకులతో పాటు నియోజక వర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.