Home లైఫ్ స్టైల్ ఆఫ్రికా అబ్బాయి ఇండియా అమ్మాయి..!

ఆఫ్రికా అబ్బాయి ఇండియా అమ్మాయి..!

123

దక్షిణాఫ్రికాలో వర్ణాంతర వివాహాలపై నిషేధం తొలగిపోయి దాదాపు పావు శతాబ్దం గడిచాక శరీరం రంగులు భిన్నంగా ఉన్న వారి మధ్య పెళ్లిళ్లు జరుగుతున్నాయి. కులమతాల పట్టింపులు ఎక్కువగా ఉండే భారత సంతతి దక్షిణాఫ్రికన్లతో వియ్యం అందుకుంటున్నారు. వారిద్దరూ ఒకరి సంస్కృతిని మరొకరు అర్థం చేసుకుని గౌరవించుకుంటున్నారు. అందులో ఒక జంట ఎలైన్, సిమోలు. వీరిద్దరిదీ ఓ అందమైన ప్రేమ కథ. ఎలైన్ భారత్‌కు చెందిన హిందూ యువతి. సిమో జూలూ ఆఫ్రికన్. ఆయన ఆమెకు ప్రత్యేకంగా అనిపించగానే ‘నువ్వంటే నాకిష్టం’ అని చెప్పాలనుకుంది కానీ అలా చెప్పలేక ’నీ బూట్లంటే నాకిష్టం’ అనేసింది. అది వారి 12 ఏళ్ల వివాహ బంధానికి దారి తీసింది. వీరి ప్రేమకు గుర్తుగా ముగ్గురు పిల్లలున్నారు.

1985 వరకు దక్షిణాఫ్రికాలో వర్ణాంతర వివాహాలపై నిషేధం ఉండేది. నిషేధాన్ని ఎత్తివేసిన రెండు దశాబ్దాల తర్వాత కూడా వీరి వివాహం సాహసోపేతమైన అడుగనే చెప్పాలి. సిమోను పెళ్లి చేసుకొంటానని చెప్పినప్పుడు ఎలైన్‌కు ఆమె కుటుంబం నుంచి గట్టి వ్యతిరేకత ఎదురైంది.“అమ్మాయి వాళ్ల అమ్మ చాలా భయపడ్డారంట’ ఇప్పటి వరకూ పెళ్ళి చేసుకున్న చాలా మంది భారతీయులు మోసపోయారు. నల్లజాతీయులను ఎలా పెళ్ళి చేసుకుంటావు? భారతీయులను చేసుకోవచ్చు కదా అని ఒత్తిడి చేశారట. ఎలైన్, సిమో వెనక్కు తగ్గలేదు. కలిసి కష్టాల్ని ఎదిరించారు. వారి జీవితాల్లో ఎదుర్కొన్న ఒడిదొడుకులే ఆ ఇద్దరినీ మరింత దగ్గర చేశాయి. అప్పుడు ఇద్దరికి కనీసం ఉద్యోగం కూడా లేదు. ఆఖరుకు కొంతకాలం పిల్లలతో కలిసి ఓ గుడారంలో బతికారు. ఎలైన్ జూలూ జాతికి చెందిన అమ్మాయి కాదు కాబట్టి వాళ్ల సంస్కృతిని నేను పాటించలేనేమోనని సిమో వాళ్ల అమ్మ కాస్త భయపడిందట! కానీ వారి ఆచార వ్యవహారాలన్నీ చాలా ఉత్సాహంగా నేర్చుకుంది. సిమోకు భజనలంటే ఏంటో తెలియదు. కానీ భజనలకు వెళ్లేవాడు. అలా తనకు అవి నచ్చాయి కూడా” బాలీవుడ్ పాటలు కూడా నేర్చుకున్నారు. భవిష్యత్తులో వర్ణాంతర వివాహాలు చేసుకునే వారికి కష్టాలు ఎదురుకాకూడదని ఎలైన్, సిమోలిద్దరూ కోరుకుంటున్నారు. చర్మం రంగును కాకుండా మనుషుల పేర్లను మాత్రమే ప్రపంచం పట్టించుకుంటే బాగుంటుందనిపిస్తుంది. ఎందుకంటే, మనుషుల్ని కలిపి ఉంచేది ప్రేమ ఒక్కటే” అని వారి అభిప్రాయం.

frican boy Indian girl

Telangana News