Home తాజా వార్తలు రేణిగుంటలో దారుణం…

రేణిగుంటలో దారుణం…

Friend Killed by other Friend

చిత్తూరు: తాను ప్రేమించిన అమ్మాయిని మరో యువకుడు ప్రేమిస్తున్నాడనే కారణంతో  అతడిని చంపిన సంఘటన జిల్లాలోని రేణిగుంట మండలం గాజుల మండ్య సమీపంలో చోటు చేసుకుంది.  స్థానికుల కథనం ప్రకారం.. రేణిగుంట మండలం గాజుల మండ్యలో జానకిరాం రెడ్డి, వంశీ రాయల్ అనే ఇద్దరు యువకులు బిటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు ఒకే అమ్మాయిని ప్రేమించారు. ఈ ప్రేమ విషయంలో యువకులు ఇద్దరు తరచూ గొడవపడేవారు. వంశీ  తమ మధ్య గొడవలకు స్వస్తి పలుకుదామని జానకిరాం రెడ్డికి సూచించాడు. దీనికి అంగీకరించిన జానకిరాం రెడ్డి, వంశీ, మరో ఏడుగురు సహచర విద్యార్థులతో కలిసి గాజులమండ్యం సమీపంలో ఓ వెంచర్‌లోకి వెళ్లారు. అనంతరం వంశీ  తన వెంట తెచ్చుకున్న కత్తితో జానకిరాం రెడ్డిపై దాడి చేశాడు. అలాగే పక్కనే  ఉన్న మరో విద్యార్థి దిలీప్ పైనా దాడి చేసి అక్కడి నుండి వంశీ పరారైయ్యాడు. తీవ్రంగా గాయపడిన జానకిరాం రెడ్డి, దిలీప్ ను మిగిలిన స్నేహితులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే జానకిరాం రెడ్డి మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.