Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

ఓ మహిళ కోసం స్నేహితుడి హత్య..

mahesh murderశంషాబాద్: యువకుడి గొంతుకోసి పెట్రోల్ పోసి కాల్చేసిన కేసును పోలీసులు ఛేదించారు. కారు, ద్విచక్రవాహనం, ఓ కత్తి, నాలుగు మోబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో తన స్నేహితుడు చనువుగా ఉండటం చూసి కక్షగట్టి నిందితుడిని హత్య చేసినట్లు తెలిసింది. మంగళవారం ఆర్జీఐఏ ఠాణాలో శంషాబాద్ జోన్ డీసీపీ పద్మజారెడ్డి, ఏసీపీ అశోక్‌కుమార్, సీఐ కృష్టప్రసాద్ వివరాలు తెలిపారు. హైదరాబాద్, జుమ్మెరాత్‌బజార్‌కు చెందిన జెర్రిగల్ల రమేష్ (24) ఫంక్షన్‌హాళ్లలో ఎలక్ట్రీషియన్, వేదికలను అలంకరణ పనులు చేస్తుంటాడు. అదే బస్తీకి చెందిన సదరు మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అతని స్నేహితుడు మహేష్ (25) సదరు మహిళతో చనువుగా ఉండటం గమనించి రమేశ్ పలుమార్లు మహేశ్‌ను హెచ్చరించి గొడవకుదిగారు.  ఈ విషయం ఆ మహిళ భర్తకి తెలియడంతో వాళ్లు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. దీనికి కారణమైన మహేష్‌ని హత మార్చాలని పథకం చేసుకున్నాడు.  వారం క్రితం కత్తిని కొన్నాడు. పథకం ప్రకారం అదే బస్తీకి చెందిన క్యాబ్‌ను అద్దెకు తీసుకున్నాడు. తన బావమరిది కలిసి అందరూ ఈ నెల 24న  కడ్తాల్  మైసిగండికి వెళ్లారు. అక్కడ అందరూ కలిసి మద్యం తాగి తిరుగు ప్రయాణం కాగా మార్గ మధ్యలో శంషాబాద్‌కి చేరుకోగానే తన గొంతు కొసి చంపేశాడు. మృతదేహాన్ని మదనపల్లి సమీపంలో పడేసి ప్రెట్రోల్ పోసి కాల్చేశారు. మరుసటి రోజు (25) న ఉదయం రమేష్ కారు తీసుకొని శంషాబాద్‌లోని సర్వీసింగ్ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడి సిబ్బంది కారులో రక్తపు మరకలను చూసి ఆర్జీఐఏ పోలీసులకు సమాచారం ఇవడంతో నిందితులు దొరికిపోయారు.

Friend killed for a woman..

Comments

comments