Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

వివాహిత హత్య కేసును ఛేదించిన పోలీసులు

Sowmya1

మన తెలంగాణ/అమీర్‌పేట : ఎర్రగడ్డ లో మిస్టరీగా మారిన వివాహిత దా రు ణ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. మూడురోజుల క్రిత ం జరిగిన హత్య కేసును పోలీసులు అన్ని కోణాల్లో తీవ్రంగా దర్యాప్తు చేసి ఎట్టకేలకు నిందితుడిని పట్టుకోగలిగారు. ఎర్రగడ్డలోని బి.శంకర్‌లాల్ నగర్‌లోగల సూర్య ఆర్క్ డ్ అపార్ట్‌మెంటులో నివాస ముంటున్న నాగభూషణం యూ సుఫ్‌గూడలోని ఎల్ అండ్ టి కంపెనిలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అనంతపురంకు చెందిన ప్రకాశ్‌తో గతం లో అస్సాంలో నాగభూషణంకు పరిచ యం ఏర్పడినట్టు తెలిసింది. తాను కూడా నగరంలోని ఎల్ అండ్ టి కంపెనీలో ఉద్యోగిగా ఉన్నట్లు తెలుస్తుంది. వీరిద్దరి గత పరిచయంతో తరచూ నాగభూషణం ఇంటికి వస్తూండేవాడు. దీంతో భార్య సౌమ్యతో పరిచయం ఏర్పడగా దీంతో వారిద్దరు సన్నిహితంగా ఉండేవారనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే సోమవారం రాత్రి సౌమ్య ఇంటిలోనే భర్త నాగభూషణం, ప్రకాశ్, సౌమ్యలు ముగ్గురూ కలిసి భోజ నం చేశారు. అనంతరం నాగభూషణం, ప్రకాశ్‌లు కలిసి డ్యూటీకి బయలుదేరి వెళ్ళిపోయారు. తర్వాత ప్రకాశ్ ఒక్కడే ఎర్రగడ్డలోని ఇంటికి వచ్చి సౌమ్యతో అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించగా ఆమె తిరస్కరించడంవల్ల జరిగిన గొడవల్లో క్షణిక ఆవేశంతో ఆమెను హత్య చేసి ఉండవచ్చనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య జరిగిన రోజు రాత్రి నుంచి భూషణం స్నేహితుడు కంపెనీకి రాకపోవడంతో పోలీసులకు అతనిపై అనుమానం కలిగి అదుపులోకి తీసుకొని విచారించగా ఆ రోజు జరిగిన సంఘటన వివరాలను పోలీసులకు వెల్లడించినట్లు తెలిసింది.

Comments

comments