Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ప్రత్యేకాధికారుల పాలనే

 From August 1 to 68 new municipalities in the state

ఆగస్టు 1 నుండి రాష్ట్రంలో నూతనంగా ఏర్పడే 68 మున్సిపాలిటీలకు మున్సిపల్ కమీనర్లు, 12751 గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారుల నియామకాలకు సంబంధించి ప్రతిపాధనలను రెండు రోజుల్లో పంపించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కె జ్యోషి ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం, హరితహారం, మత్సశాఖ, పాడిగేదెల పంపి ణీ, వివిధ కేసులకు సంబంధించి మెడికల్, పోస్టుమార్టమ్, నివేధికలు, లారీ ల సమ్మె తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా, డిజిపి మహేందర్‌రెడ్డి, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్, మత్సశాఖ, పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్, సుల్తానియా, పిసిసిఎస్ పికె ఝూ, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ నీతూప్రసాద్, సిఎంవో వోఎస్‌డి (హరితహారం )శ్రీమతి ప్రియాంక వర్గీస్, పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ టికె శ్రీదేవి, మత్సశాఖ కమీషనర్ సువర్ణ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా (మొదటి పేజీ తరువాయి) సిఎస్ మాట్లాడుతూ 12751 గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లు, 565 గ్రామపంచాయతీ క్లస్టర్లకు ఇన్‌ఛార్జీలుగా గ్రామ పంచాయతీ సెక్రటరీలను, 68 నూతన మున్సిపాలిటీలకు మున్సిపల్ కమీషనర్లుగా తహసీల్దార్లు, స్పెషన్ ఆఫీశర్లుగా ఆర్డీవో లేదా జిల్లా స్థాయి అధికారులను నియమించే ప్రతిపాధనలను రూపోందించి రెండు రోజుల్లో మున్సిపల్ కమీషనర్ పంచాయతీ రాజ్ కమీషనర్‌కు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. మున్సిపాలిటీలకు సంబంధించి ముఖ్యకార్యదర్శి అరవిం ద్‌కుమార్ మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చిం చి జిల్లా కలెక్టర్లు స్పెషల్ ఆఫీసర్లు, కమీషనర్ల నియామకానికి ప్రతిపాదనలు పంపాలని, కొన్ని మండలాలకు ఒకటి కంటే ఎక్కువ పట్టణ స్థానిక సంస్థ (అర్బన్ లోకల్ బాడీ)లు ఉండే దానికనుగుణంగా ప్రత్యేక ప్రతిపాదనలు ఉండాలన్నారు. గ్రామ పంచాయతీలోని మినిట్స్ పుస్తకాలను సీజ్ చేసి కొత్త మినిట్స్ పుస్తకాలను తెరవాలని అన్నారు. కొత్త మున్సిపాలిటీల కార్యాలయాల వద్ద బోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రస్తుతం ఉన్న బ్యాంకు ఖాతాలను మూసి వేసి జాతీయ బ్యాంకులలో కొత్తగా ఖాతాలను తెరవాలన్నారు. వివిద మున్సిపాలిటీలలో టియుఎఫ్‌ఐడిసి ద్వారా చేపట్టే పనులపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా మున్సిపల్ కమీషనర్ల తో సమీక్షించాలని, ఈ పనులు డిసెంబర్ నాటికి పూర్తయ్యేలా కాలానుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఏవై నా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని అరవింద్‌కుమార్ తెలిపారు. ఈ పనులన్ని వివిధ దశలో ఉన్నాయని, ఈఎన్‌సి మున్సిపల్ కమీషనర్లతో ఇప్పటికే సమీక్షించారని అన్నారు. మున్సిపాలిటీల్లో ప్రధాన రోడ్లు, ట్రాఫిక్ జంక్ష న్లు, ముఖ్యమైన ప్రాంతాలలో సుందరీకరణ పనులు చేపడుతున్నామన్నారు.

భూ సేకరణ ప్రకటలను సమాచారశాఖ ద్వారానే జారీ చేయాలని, గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కానీ కొంత మంది కలెక్టర్లు నేరుగా భూసేకరణ ప్రకటనలను జారీ చేస్తున్నారని అన్నారు. ఇకముందు సమాచార శాఖ ద్వారానే జారీ చేయాలని తెలిపారు. ఈ విషయంలో డిపిఆర్‌వోలతో సమీక్షించాలని, బకాయిలు ఉన్న 37 కోట్ల రూపాయలు విడుదలకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను అరవింద్‌కుమార్ కోరారు. పంచాయతీ రాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ మాట్లాడుతూ నూతన గ్రామ పంచాయతీలను క్లస్టర్లకు కలపాలని, గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియామకంపై పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తున్నామన్నారు. వివిధ కేసులకు సంబంధించి పోస్టుమార్టమ్ నివేదికలు, మెడికల్ రిపోర్టులు జిల్లాల వారిగా పెండిగ్‌లో లేకుండా చూడాలని సిఎస్ ఆదేశించా రు. 15 రోజుల తరువాత పురోగతిపై సమీక్షిస్తామన్నారు. వివిధ కేసులకు సంబంధించి ఇన్‌వెస్టిగేషన్‌ను కాలపరిమితిలోగా పూర్తి చేయాల్సి ఉంటుందని, మెడికల్, పోస్ట్‌మార్టమ్ నివేదికలు జాప్యం లేకుండా చూడాలని డిజిపి మహేందర్‌రెడ్డి కలెక్టర్లను కోరారు. రాష్ట్ర స్థాయిలోను ఈ అంశంపై సమీక్షిస్తామని, జిల్లా స్థాయిలో కలెక్టర్లు పెండెన్సీపై సమీక్షించాలన్నా రు. ఈ కేసులను సమీక్షించడానికి ప్రత్యేక మెకానిజమ్‌ను రూపోందించాలని అన్నారు. ఆర్‌టివోల ద్వారా ఫిట్‌నెస్ సర్టిఫికెట్స్ జారీ వేగవతం చేయాలన్నారు. టైంబాండ్ పద్దతిలో రిపోర్టులు సమర్పించాలన్నారు. ఈ నెల 20 నుండి లారీ సమ్మెకు ప్రైవేటు యాజమానులు పిలుపునిచ్చినందున నిత్యావసర వస్తువుల పంపిణీకి ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా కలెక్టర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సిఎస్ ఆదేశించారు. రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ మాట్లాడుతూ సమ్మె విషయంలో లారీల అసోసియేషన్లు రాష్ట్రానికి సంబంధించి లోడింగ్, అన్‌లోడింగ్ సందర్భంగా హమాలీలు అధనంగా డబ్బులు అడుగుతున్నారని తెలిపారు. ఈ విషయమై ప్రత్యే క టీంలు ఏర్పాటు చేసి ఇక ముందు జరుగకుండా చూడాలని సూచించారు. ఓవర్ లోడింగ్ అరికట్టాలని, డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో పార్కింగ్ ఫీజులు వసూ లు చేయకుండా చూడాలని కలెక్టర్లను కోరారు. చేప పిల్లలకు సంబంధించి పశుసంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ… గొర్రెల పంపిణీ మాదిరిగానే చేప పిల్లల పంపిణీకి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను కోరారు. 21568 వాటర్ బాడీస్‌లలో దాదాపు 80 కోట్ల చేప పిల్లల పంపిణీ కోసం టెండర్లు పూర్యయ్యాయని, సప్లయర్ల వేరిఫికేషన్ త్వరలో పూర్తవుతుందని తెలిపారు. ఈ సెలాఖరుకు చెప పిల్లలు సిద్దంగా ఉంటాయని అన్నారు. వచ్చే చేపల ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకొని మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ఇంటిగ్రేటెడ్ ఫిషరిస్ డెవలప్‌మెంట్ స్కీం అమలు చేస్తున్నామని, లబ్దిదారుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, జిల్లా స్థాయి సాంక్షన్ కమిటీ ఏర్పాట చేసి ఎంపిక చేయాలని అన్నారు. మొబైల్ వ్యాన్, నెట్స్, క్రాఫ్ట్, వెండింగ్ యూనిట్స్ ఇస్తామని, బెనిఫిషరీ కాంట్రీబూషన్స్‌ను వసూలు చేయావల్సి ఉంటుందన్నారు. ఆగస్టు 15 నాటికి మంజూరు ఉత్తర్వులు జారీ చేస్తామని, ఆగస్టు చివరి వారంలో గ్రౌండింగ్ ప్రారంభవుతుందన్నారు. 850 కోట్లతో చేపడుతున్నట్లు, ఈ అం శంపై కలెక్టర్లు ప్రత్యేకంగా సమీక్షించాలన్నారు. రాష్ట్రంలో 2.13 లక్షల పాడిగేదెల పంపిణీకి సంబంధించి జిల్లా కలెక్టర్లు ప్రత్యేక అకౌంట్లు ఓపెన్ చేయాలని సందిప్‌కుమార్ సుల్తానియా కోరారు. ప్రభుత్వం ప్రోత్సాహం పోందుతున్న 4 డైరీలకు చెందిన రైతులకు పాడి గేదెలు సబ్సిడీపై అందిస్తామని, లబ్దిదారుల వివరాలు డైరీల వద్ద ఉన్నాయన్నారు. ఈ గేదెల ఇన్సూరెన్స్‌కు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రూ.5వేల రవాణ బత్యం ఇస్తామని, ప్రతి గేదెకు 300 కేజీ ల దాణా ఇస్తామన్నారు. డెయిరీ చైర్మేన్లు, పశుసంవర్ధక శా ఖ సిబ్బంది సహకారం తీసుకోవాలన్నారు. తమకు నచ్చిన గేదెను ఎక్కడ నుండైనా కొనుగోలు చేయవచ్చన్నారు. లబ్దిదారులు తమవాటాను చెల్లించాల్సి ఉంటుందని, పూర్తి మార్గదర్శకాలను కలెక్టర్లకు పంపుతామని తెలిపారు.
మెదక్ ప్రతినిధి : ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ మెదక్ జిల్లాలోని నాలుగు అర్బన్ పార్క్‌లు, 22 కన్వర్జైషన్ ప్రాంతాలను గుర్తించడం జరిగిందన్నారు. నాలుగు అర్బన్ పార్కులలో 1 జిల్లా అటవీశాఖ అధికారి మిగతా మూడు హెచ్‌ఎండీఏ అధికారులు డిపిఆర్‌లను సిద్దం చేస్తున్నారని తెలిపారు. అర్బన్ పార్కులను ఏర్పాటు చేసే ప్రాంతాన్ని సంరక్షించేందుకు ఫెన్సింగ్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఇప్పటికే గుర్తించిన ప్రాంతా ల్లో మొక్కలు నాటేందుకు సిద్ధం చేశామని, త్వరలోనే మొ క్కలు నాటుతామన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా ఎస్పీ చందనాదీప్తి, జాయింట్ కలెక్టర్ నగేష్, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు, జిల్లా అటవీశాఖ అధికారి పద్మజారాణీ, మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి అశోక్‌కుమార్, జిల్లా మత్స అభివృద్ధి అధికారి నరసింహారావు, జిల్లా రవాణాశాఖాధికారి గణేష్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
సంగారెడ్డి ప్రతినిధి : అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన 7 బ్లాక్‌లలో పనులు ప్రా రంభమైనట్లు తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో సచివాలయం నుంచి డిజీపి మహేందర్ రెడ్డి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ కమీషనర్ నీతుప్రసాద్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఆయా శాఖల ఉన్నతాధికారులు, జిల్లా నుంచి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, డిఆర్‌వో అంబదాస్, చీఫ్ కన్జర్వేటర్ ఆర్ ఫారెస్ట్ ఎ.కె.సిన్హా, అటవీశాఖాధికారి వెంకటేశ్వర్లు, డీపీవో వెంకటేశ్వర్లు, వైద్యారోగ్యశాఖ అధికారి రాథోడ్, డిసిహెచ్ డా.మురారి, మత్సశాఖ అధికారి సుజాత, పశుసంవర్థకశాఖ జేడి రామారావు రాథోడ్, పోలీసు, అటవీశాఖ అధికారులు తదితరలు పాల్గొన్నారు.
సిద్దిపేట అర్బన్ : హరిత హారంలో తెలంగాణలోని సిద్దిపేటను నెంబర్‌వన్‌గా ఉందని రాష్ట్ర ప్రభుత్వ చీప్‌సెక్రటరీ ఎస్‌కె జోషి జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. మంగళవారం రా్రష్ట్ర ప్రభుత్వ చీప్ సెక్రటరీ ఎస్‌కె జోషి, హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాలు నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట్రామారెడ్డి జిల్లాలో జరుగుతున్న ప్రగతిపై హరితహారం నిర్వాహణపై వివరించారు. ఈ వీడియో కాన్సరెన్స్‌లో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జెసీ పద్మాకర్, డీఆర్‌డీఏ అధికారి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments