Home తాజా వార్తలు నేటి నుంచి మహిళల టి- 20 ప్రపంచకప్‌

నేటి నుంచి మహిళల టి- 20 ప్రపంచకప్‌

From today onwards, women T20 World Cup

గయానా: మహిళల ట్వంటీ 20 ప్రపంచకప్‌కు శుక్రవారం తెరలేవనుంది. వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న ఈ సమరంలో పది జట్లు పోటీ పడుతున్నాయి. టోర్నీలో పాల్గొంటున్న జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌ఎలో ఆతిథ్య వెస్టిండీస్‌తో పాటు ఇంగ్లండ్, శ్రీలంక, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. గ్రూప్‌బిలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు తన గ్రూప్‌లోని మిగతా జట్లతో పోటీ పడుతుంది. ప్రతి గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచిన రెండేసి జట్లు సెమీఫైనల్‌కు చేరుతాయి. శుక్రవారం భారత్‌న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ప్రపంచకప్‌కు తెరలేస్తుంది. కాగా, నవంబర్ 24న జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తోంది. అంటిగువాలో ఫైనల్ సమరం జరుగుతుంది.

నేడు కివీస్‌తో భారత్ తొలి పోరు
భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను శుక్రవారం న్యూజిలాండ్‌తో ఆడనుంది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ ప్రపంచకప్‌లో ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. భారత్‌తో పోల్చితే న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లలో కివీస్ కూడా ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఆ జట్టులో అగ్రశ్రేణి క్రికెటర్లు ఉన్నారు. ఇక, హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్‌ను కూడా తక్కువ అంచన వేయలేం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. విధ్వంసక బ్యాటింగ్‌కు మరో పేరుగా చెప్పుకునే ఓపెనర్ స్మృతి మందనపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. సీనియర్ క్రికెటర్ మిథాలీరాజ్ రూపంలో మరో పదునైన అస్త్రం ఉండనే ఉంది. ఎటువంటి బౌలింగ్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా మిథాలీకి ఉంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ను కూడా తక్కువ అంచన వేయలేం. జెమీమా రోడ్రిగ్స్, వేదా కృష్ణమూర్తి, తానియా భాటియా, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, పూజా వస్త్రాకర్, ఏక్తా బిస్త్ తదితరులతో భారత్ చాలా బలంగా ఉంది. సమష్టిగా రాణిస్తే కివీస్‌ను ఓడించడం భారత్‌కు కష్టమేమి లేదు. గ్రూప్‌లో భారత్‌కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల నుంచే గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. పాకిస్థాన్, ఐర్లాండ్ జట్లను ఓడించడం భారత్‌కు కష్టం కాదు. ఆసీస్, కివీస్‌లలో ఒకరిని ఓడిస్తే సెమీస్‌కు చేరడం ఖాయం.

From today onwards, women T20 World Cup

Telangana Latest News