Search
Friday 21 September 2018
  • :
  • :

టిడిపి ఆద్వర్యంలో రోగులకు పండ్ల పంపిణి

Patient-and-Fruit

కురవి: తెలుగుదేశం పార్టీ ఆద్వర్యంలో మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని రోగులకు పాలు, పండ్లు పంపిణి చేశారు. నందమూరి తారక రామారావు 21వ వర్థంతి సందర్భంగా ఆ పార్టీ ఆద్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో ఎన్‌టిఆర్ చిత్రపటానికి పూలమాళలు వేసి ఘనంగా నివాళు అర్పించారు. అనంతరం రోగులకు పాలు,పండ్లు పంపిణి చేశారు. ఈ సందర్భంగా టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు నూతక్కి ప్రసాద్‌రావు, జిల్లా కార్యధర్శి బండి శ్రీనువాస్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతికగా నిలిచారని, కార్మిక, కర్షక, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేశారని వారు అన్నారు.

ఎస్‌సి, ఎస్‌టి,బిసి,మైనార్టీ నిరుపేద ప్రజలకు సంక్షేమ పథకాలు, ఒక్కరూపాయకు కిలో బియ్యం అందించిన ఘనత ఎన్టీఆర్‌కే ఉందని, తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల గుండెల్లో ఆరాధ్యదైవంగా నిలిచారని వారు కొనియాడారు. పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త స్వర్గీయ ఎన్టీ రామారావు ఆశయ సాధన కోసం కృషి చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా టిడిపి మండల ప్రధాన కార్యధర్శి శ్యామల శ్రీనువాస్, ఉపాధ్యక్షులు పేరం వీరస్వామి, అధికార ప్రతినిధి అత్తునూరి రాములు, నాయకులు బండి రమేష్, ముత్తిలింగం, దొంగల జనార్థన్‌రెడ్డి, కనుకటి మల్లయ్య, మొలుగూరి వెంకటేశ్వర్లు, వీరన్న, కానిగంటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments