Home నాగర్ కర్నూల్ శీతల పానియాలకు భలే గిరాకీ

శీతల పానియాలకు భలే గిరాకీ

Cool-Drinks

కల్వకుర్తి : వేసవి కాలం ప్రారంభంలోనే బానుడి భగ భగలు పెరిగాయి. ఇదిలా ఉంటే ముఖ్యంగా ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షలు ఆరంభంలోనే బానుడి తాపం ఇలా ఉంటే విద్యార్థులు పరీక్షల సమయంలో తల్లడి ల్లుతు న్నారు. వేసవి కాలాన్ని పురష్కరించుకొని ఇతర ప్రాంతా ల నుండి సీతల పానియాలు విక్రయించేందుకు పెద్ద ఎత్తున షాపులు వెలువడ్డాయి. ఇవే కాకుండా పుచ్చ కాయల వ్యాపారం, పేద వాడి ప్రిడ్జి కుండల వ్యాపారం, ఊపందుకుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వ్యాపారాలు బాగా లేవని శీతలపానియాల విక్రయ దారు లు అంటున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో ఇచ్చే సంత్రాలు, పుచ్చకాయలు, అంగురాళ ధరలకు రెక్కలు వచ్చాయి. వీటితో పాటు ఐస్‌క్రీస్ పార్లర్‌ల వద్ద సాయ ంకాలం విపరీత గిరాకీలు పెరిగాయి. బానుడి భగభగ లకు ఉదయం 8గంటల నుండే ప్రజలు భయట తిరగాల ంటే బెంబెలెత్తుతున్నారు. మధ్యాహ్నాం వేళ రోడ్లు నిర్మాను ష్యంగా మారుతున్నాయి. సీత పానియాల వ్యాపారులు దీనిని అదునుగా తీసుకొని గత సంవత్సరం కంటే ఈ సం వత్సరం ధరలు పెంచారు. ఏది ఏమైన వేసవి కాలం వచ్చిందంటే సీతల పానియాలకు గిరాకి ఎక్కువ. ప్రతి ఒక్కరు పండ్ల రసాలు, జ్యూస్ సెంటర్‌ల వద్ద బారులు తీరుతున్నారు. ఇళ్ళల్లో అంబలి కాసుకునే వారు రాగులు, జొన్నలకు బియ్యం ధర కంటే అధికంగా రాగి గింజల ధర లు ఎక్కువగా ఉండడంతో షుగర్ వ్యాది గ్రస్తులు తప్పని పరిస్థితుల్లో జొన్నలు, రాగుల కొనుగోలు తప్పదని అంటు న్నారు. ఏది ఏమైన ఈ సంవత్సరం ఎండలు అధికంగా ఉ ంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలుపు తున్నా రు. వైద్యులుసైతం వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్ర త్తలపై సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఇంట్లో గ్లూకోస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకొని పి ల్లలకు, పెద్దలకు అందించాలని వైద్యులు సూచిసు ్తన్నా రు. భయటికి వెళ్ళేటప్పుడు తలపై టోపి, టవాల్‌తో వెళ్ళా లని, వాహానాలపై వెళ్ళే వారు మొఖానికి రక్షణ ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.