Search
Wednesday 21 November 2018
  • :
  • :

డబుల్ బెడ్‌రూం ఇండ్ల కాలనీల్లో పూర్తి స్థాయిలో సౌకర్యాలు

Full-fledged facilities in double bedroom houses

కలెక్టర్ వెంకట్రామిరెడ్డి

మన తెలంగాణ/సిద్దిపేట  : సిద్దిపేటలో నిర్మించిన డబు ల్ బెడ్ రూం ఇండ్ల గృహ ప్రవే శాలకు అన్ని విధాలుగా సౌక ర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అధికారులకు ఆదేశించారు. సోమవారం సమీ కృత కలెక్టర్  కార్యాలయంలో జిల్లా అదికారులతో ఆయన సమీక్ష సమాశెశం నిర్వహించారు.సియం కేసిఆర్,మంత్రి హరీష్‌రావుల విజన్‌కు అనుగుణంగా నిర్మితమైన సిద్దిపేట గ్రేటెడ్ కమ్యూనిటి కాలని డబుల్ బెడ్‌రూం ఇండ్ల ప్రవేశాలకు పూర్తి స్ధాయిలో ప్రణాలికలు రూ పొందించాలన్నారు. ఈ కాలనికి స్వాగత బోర్డు, విద్యుత్ సబ్‌స్టేషన్, లింక్‌రోడ్లతో పాటు ప్రజలకు అన్నివిదాల అనుకూలంగా ఉండేలా దుకాణ సముదాయాలను ఏర్పాటు చేస్తామన్నారు. 30 మం ది రైతులు కూరగాయలు విక్రయించేలా రైతుబజార్, పోలీస్ కంట్రోల్ రూం లాంటి సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. కాలనీ చుట్టుప్రక్కల ప్రాంతం ట్రాఫిక్ కంట్రోల్ ఉండేలా ఆర్ అండ్‌బి, పోలిస్ శాఖ అదికారులు చర్చించి జాతీయ రహదారి నుండి ఆమోదం పోందేలా ఈఎన్ సికి ప్రతిపాదన పంపాలన్నారు. ఈనెల చివరి వారంలో పట్టణంలో నిర్మించిన 1960 డబుల్ బెడ్ రూంల గృహ ప్రవేశాలు సిఎం కేసిఆర్ చెస్తారని తెలిపారు. ఇందుకు సంబంధించి అధికారులు మిగిలిన పూర్తి పనులు త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. కాలనీలో మంచినీటి, విద్యుత్, లాంటి పూర్తి సౌకర్యాలను ఈ నెల 15 లోపు పూర్తయ్యెలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావే శంలో ఆర్డిఒ ముత్యం రెడ్డి,మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, తహసీల్దార్ పరమేశం, ప్రజా ప్రతినిధులు మారెడ్డి రవీందర్ రెడ్డి, బర్ల మల్లికార్జున్, శ్రీనివాస్, నర్సింలు పాల్గొన్నారు.

సిద్దిపేట జిల్లా రిజర్వాయర్‌ల ఖిల్లా : సిద్దిపేట జిల్లా రిజర్వాయర్‌ల ఖిల్లాగా మారిందని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. సమీకృత కలెక్టరెట్ కార్యలయంలో కోమురవెళ్లి మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రదాన కాల్వ భూ సేకరణపై సమీక్ష నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలో 475 రెవెన్యూ గ్రామలుం డగా 225 గ్రామాలలో రిజర్వాయర్‌లు అనుసందనంగా కాల్వల భూసేకరణ చేస్తున్నామని ఆయ గ్రామాలకు వివరించారు. కొమురవెళ్లి మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రధాన కాల్వ సిద్దిపేట జిల్లాతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ వరకు కాలువ పోతుందని వివరిస్తు ఇందుకు భూ సేకరన చేపడుతున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణాల ద్వారా సాగు నీరు రావడంతో పచ్చని పం ట పొలాలతో భూములన్ని సస్యశ్యామలం కానున్నాయన్నారు. అనంతరం కొండపోచమ్మ సాగర్ కాలువ నిర్మాణాలపై కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సమీక్ష నిర్వహించి అధికారులకు తగు సూచనలు అందించారు. కొండపోచమ్మ కాలువ ఆయకట్టు ద్వారా 2.85 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఉం టుందన్నారు. సమీక్షల్లో జెసి పద్మాకర్, ఆర్డిఒలు ముత్యంరెడ్డి, వజేందర్ రెడ్డి, ఇరిగేషన్ ఎస్‌ఈ వేణు, ఈఈ దేవేందర్ రెడ్డితో పాటు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

comments