Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

పింఛను నిర్ధారణ ప్రక్రియ నెలలోగా పూర్తి

cseన్యూఢిల్లీ: పింఛను నిర్ధారణ ప్రక్రియ ను నెల రోజుల్లోగా పూర్తి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖకు కేంద్ర సమాచార కమిషన్ (సిఐసి) ఆదేశిం చింది. ఏడాది గడుస్తున్నా తన పింఛను నిర్ధారణ ప్రక్రియను పూర్తి చేయనందున పింఛనును ఇవ్వడం లేదని చంద్రావతి అనే మహిళ పెట్టుకున్న ఫిర్యాదును పరిశీలించి సిఐసి ఈ ఆదేశాన్ని ఇచ్చింది. పింఛను హక్కు అనేది భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 కింద వస్తుందని, అది జీవించే హక్కుకు సంబంధించిందని పేర్కొంది. పింఛ నుదారు చనిపోతేనో లేక పింఛనుదారు ఆదాయం దారిద్య్ర రేఖపైన ఉంటే నో తప్పించి ఎట్టి కారణాలతో పింఛను ఇవ్వడాన్ని కాదనడం లేక ఆలస్యం చేయడం చేయకూడదని సమాచార కమిషనర్ సుధీర్ ఆచార్యులు స్పష్టం చేశారు. పింఛను నిర్ధారణ ప్రక్రియను ఏడాదికిపైగా నిర్ధారించకుండా జాగు చేయడాన్ని , పింఛనుదారుకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే నిర్ధారణ ప్రక్రియ పేరిట ఆలస్యం చేయడాన్ని, ఆపడాన్ని సిఐసి తప్పుపట్టింది. సమా చారం హక్కు చట్టం కింద తనకున్న అధికారాన్ని వినియోగించుకుని ఆచా ర్యులు పరిస్థితిన చక్కదిద్దాలని, పింఛనును నెలకు మించి ఆపరాదని సాంఘిక సంక్షేమ శాఖకు ఆదేశించారు. నెలలోగా పింఛను నిర్దారించి, పింఛనును ఆపకుండా సజావుగా ఇవ్వాలని ఆయన తన ఉత్తర్వులో పేర్కొన్నారు.

Comments

comments