Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

శ్రీరాంసాగర్‌కు వరద

ఎగువ నుంచి వచ్చి చేరుతున్న నీరు
18.44 టిఎంసిలకు పెరిగిన నిల్వ

Dam

హైదరాబాద్: శ్రీరాంసాగర్‌కు జలకళ వస్తోంది. ఎగువ నుంచి స్థిరంగా 1,16,000 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఫలితంగా 90.31 టిఎంసిల సామర్థం ఉన్న పోచంపాడు ప్రాజెక్టులో 18.44 టిఎంసిల నీరు నిల్వ అయింది. ఇంకా 71 టిఎంసిల నీరొస్తే శ్రీరాంసాగర్ గేట్లెత్తుతారు. అదేవిధంగా కడెం ప్రాజెక్టులోకి 2400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, మరో అర టిఎంసి నీరు వచ్చి చేరితే ప్రాజెక్టు గేట్లెత్తుతారు. నిజాంసాగర్‌లో 2400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ప్రస్తుతం 2 టిఎంసిల నీరు మాత్రమే రిజర్వాయర్లో ఉంది. మరో 16 టిఎంసిల నీరొస్తేనే నిజాంసాగర్ పూర్తిస్థాయిలో నిండుతుంది. ఎల్లంపల్లి రిజర్వాయర్లో 6110 క్యూసెక్కల ఇన్‌ఫ్లో నమోదైంది. గత రెండు రోజులుగా కడెం ప్రాజెక్టు నుంచి వచ్చిన నీళ్లు ఎల్లంపల్లిలోకి వస్తున్నాయి. 20 టిఎంసిల సామర్ధం ఉన్న ఎల్లంపల్లిలో 8.55 టిఎంసిలు రావాల్సి ఉంది. సింగూరు, లోయర్ మానేరు డ్యాంలలోకి ఇన్‌ఫ్లో లేదు. కృష్ణా బేసిన్‌లో ఆల్మట్టికి ఇన్‌ఫ్లో లేకపోగా, 35,000 క్యూసెక్కులను దిగువకు వదిలి నారాయణపూర్ డ్యాంను  నింపుకుంటున్నారు. ఉజ్జయిని డ్యాంలోకి 32 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, మరో 30 టిఎంసిల నీరు వస్తేనే గేట్లు తెరిచేది. జూరాలకు 2500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. తుంగభద్రకు 6326 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలకు ఇన్‌ప్లో లేదు.

Comments

comments