Home తాజా వార్తలు శాంతిభద్రతల పరిరక్షణకు కార్యాచరణ : డిజిపి

శాంతిభద్రతల పరిరక్షణకు కార్యాచరణ : డిజిపి

TDGP

మహబూబ్‌నగర్ : శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలంగాణ డిజిపి ముదిరెడ్డి మహేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మహబూబ్‌నగర్‌లో పర్యటించారు. అనంతరం జిల్లా ఎస్‌పి కార్యాలయంలో సమీక్ష చేశారు. నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటే పెట్టుబడులు వస్తాయన్నారు. పెట్టుబడులు రావడం వల్ల గ్రామసీమలు అభివృద్ధి చెందుతాయని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించినప్పుడే శాంతిభద్రతల పరిరక్షణ సులభతరమవుతుందని ఆయన చెప్పారు. శాంతి, సహనంతో సాగాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఆయన వెల్లడించారు.

Function to Preserve Law and Order : DGP