Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

మిషన్ కాకతీయకు నిధులు మంజూరు

HARISHRAO

మన తెలంగాణ/ సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట నియో జకవర్గంలోని సిద్దిపేట మండలంలో మూడవ విడత మిషన్ కాకతీయ పనులకు సంబంధించి 4.52 కోట్లు మంజూరైనట్టు మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. మూడవ విడత కోసం మొత్తం 34 చెరు వులకు ప్రతిపాధనలు పంపగా వీటిలో 26 చెరువు లకు సంబంధించిన పనులు ఖరారైనట్టు తెలిపారు.

సిద్దిపేట మండలంలోని చింతమడక టేకుల కుంట, షాలోని కుంట, మాచాపూర్ గ్రామంలోని నర్సింలు కుంట, తడకపల్లి గ్రామంలోని దామరాళ్ల కుంట, చెక్‌డ్యామ్ పరుపు బండల మరమ్మత్తుతో పాటు, వెంకటాపూర్ గ్రామంలోని కొనగంటల కుంట, చెక్‌డ్యామ్ బామణి రాళ్ల మర మ్మత్తు, ఇబ్రహీంపూర్ గ్రామంలోని చిన్నకుంట, బుస్సాపూర్ గ్రామంలోని నిమ్మవాని కుంట, చెక్ డ్యామ్ బుడకుంటకు మర మ్మత్తు, రంగథాంపల్లిలోని వొల్కచెరువు, బతుకమ్మ కుంట, ఇర్కొడు గ్రామంలోని గోపాలకుంట, చిన్న గుండవెల్లి గ్రామంలోని సొప్పరోని కుంట, పుల్లూరు గ్రామంలోని నాగులకుంట, బూరుగుపల్లి గ్రామం లోని చల్లమయ్య కుంట, మిట్టపల్లి చెక్ డ్యామ్‌కు మరమ్మత్తు, ఎల్లుపల్లి గ్రామంలోని హరిహర పౌల్ట్రి కుంట, నర్సాపూర్ గ్రామంలోని చెక్‌డామ్‌కు మర మ్మత్తు, పొన్నాల గ్రామంలోని జంగారెడ్డి కుంట, సిద్దిపేట గ్రామంలోని కప్పలకుంట, నారాయణరావు పేట గ్రామంలోని కొనగరి భూమయ్య బావి, కోదండ రావుపల్లి గ్రామంలోని షాలోని కుంట,బచ్చాయపల్లి గ్రామంలోని చెక్‌డ్యామ్‌కు మరమ్మత్తు, లక్ష్మిదేవిపల్లి చెక్‌డామ్ మరమ్మత్తు, ఎన్‌సాన్‌పల్లి గ్రామంలోని చెక్‌డ్యామ్‌కు మరమ్మత్తుకు నిధులు మంజూరైనట్టు తెలిపారు.

త్వరలోనే వీటి పనులను ప్రారంభించను న్నామని తెలిపారు. రంగధాంపల్లి ఒల్కచెరువు సుంద రీకరణకు కోటి ఇరవై మూడు లక్షల రూపాయలు మంజూరైనట్టు తెలిపారు. ఈ పనుల మూలంగా భూగర్భ జలాల మట్టాలు పెరుగుతాయని అన్నారు. సిద్దిపేట మండలలోని వివిధ చెరువులు, కుంటు, ఫీడర్ ఛానల్స్‌తో పాటు చెక్‌డ్యామ్‌లు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయని అన్నారు.

Comments

comments