Home తాజా వార్తలు రూపాయికే అంత్యక్రియలు…

రూపాయికే అంత్యక్రియలు…

 

కరీంనగర్ పాలకసంస్థ పథకం, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కెటిఆర్ ప్రశంసలు

హైదరాబాద్: రూపాయికే దహన సంస్కారాలు చేసే మహత్తర కార్యక్రమానికి శ్రీ కారం చుట్టిన కరీంనగర్ నగర పాలక సంస్థపై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ ఒక్క పథకంతో ప్రస్తుతం కరీంనగర మున్సిపల్ కార్పొరేషన్ అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. దేశంలోని అన్ని కార్పొరేషన్లకు ప్రస్తుతం కరీ ంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక రోల్‌మాడల్‌గా నిలిచినట్లు అ యింది. జూన్ 15వ తేదీ నుంచి కార్పొరేషన్ పరిధిలో అమలు చే స్తున్న విషయాన్ని తెలుసుకున్న భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెంటనే స్పందించారు. కరీంనగర్ కార్పొరేషన్‌ను ప్రత్యేకంగా అభినందనలను తన ట్విట్ట ర్ ద్వారా తెలియజేశారు.

కులమతాలు, పేద ధనిక బేధభావం లేకుండా అంతిమ సంస్కారాల కోసం ప్రత్యేకంగా పథకాన్ని రూపొందించిన కరీంనగర్ కార్పొరేషన్‌పై ఉప రాష్ట్రపతి ప్రశంసల జల్లు కురిపించారు. ప్రస్తుతం కరీంనగర్ నగర పాలక సంస్థ చేపట్టిన ఒక్క రూపాయికే దహన సంస్కరాల కార్యక్రమం కూడా నిలిచింది. దీనికి దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతుండడంతో రాష్ట్ర పురపాలక శాఖ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అమలు చేసేందుకు సాధ్యసాధ్యాలపై కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్ని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ స్వయంగా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను త్వరలో సిద్దం చేస్తామన్నారు. జీవితంలో ముగింపు అంకెం ఎవరికి భారం కాకూడన్న ఉద్దేశ్యంతో కరీంనగర్ కార్పొరేషన్ తరహాలోనే అన్ని మున్సిపాలిటీల్లో అమలు చేస్తామని సూచన ప్రాయం గా ఆయన వెల్లడించారు.

వాస్తవానికి కులాలు, మతాలతో సంబంధం లేకుండా వారి వారి సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలను పూర్తి చేసేందుకు కరీంనగర్ కార్పొరేషన్ ప్రతేకంగా రూ.1.5 కోట్ల నిధులు కూడా మంజూరు చేసింది. వీటితో పాటు రెండు వ్యాన్‌లు, ఫ్రీజర్లను కూడా కార్పొరేషన్ కోనుగోలు చేసింది. ఇక పార్ధివదేహాలను కాల్చేవారికి కట్టెలు, కిరోసిన్, పూడ్చిపెట్టే వారికి గొయ్యి తవ్వడం వంటి వాటిని కూడా కార్పొరేషనే సమకూర్చుతోంది. ఈ పథకానికి నిధులు సమస్య తలెత్తకుండా దాతల నుంచి విరాళాలను కూడా సేకరించాలని నిర్ణయించింది.

ఇందుకోసం ప్రత్యేకంగా ఒక బ్యాంక్ ఖాతాను కూడా తెరిచింది. కాగా జీహెచ్‌ఎంసి మహాప్రస్థానం పేరుమీద దహన సంస్కారల కోసం అధునాతనమైన న శ్మశాన వాటికలను పూర్తిగా పచ్చదనంతో అభివృద్ధి చేస్తోంది. దహన సంస్కారాలకు వచ్చే వారి కోసం అవసరమైన అన్ని సౌకర్యాలను సమకూర్చుతోంది. స్నానం చేసేందుకు వేడి నీటి సౌకర్యాన్ని సైతం కల్పిస్తోంది. కాగా ఇప్పటికే జూబ్లీహిల్స్‌లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన మహాప్రస్థానాన్ని కూడా పలు రాష్ట్రాల్లోని కార్పొరేషన్లు ఆదర్శంగా తీసుకుని ఆయా పట్టణాల్లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మొత్తం మీద దహాన సంస్కారాల విషయంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు చాలా ఉదారంగా, మానవతా దృక్పధంతో నిర్ణయాలు తీసుకోవడం ఎంతైనా అభినందించాల్సిందే.

కెటిఆర్ ప్రశంస

ఒక్క రూపాయికే అంతిమయాత్ర పథకాన్ని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు ట్విటర్ ద్వారా ప్రశంసించారు. ఒక్క రూపాయికే అంతిమ సంస్కారాలు పూర్తి చేయడం పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కరీంనగర్ మేయర్, ఎంఎల్‌ఎ, కార్పోరేటర్లను అభినందిస్తూ కెటిఆర్ ట్వీట్ చేశారు. ఇతర ప్రాంతాల్లో కూడా ఈ పథకం అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని పురపాలకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్‌ను కెటిఆర్ కోరారు. కెటిఆర్ విజ్ఞప్తి మేరకు ఇతర ప్రాంతాల్లో ఈ పథకం అమలు చేయడానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని పురపాలకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు.

Funeral to the Rupee without the Poor Richer Sense