Home తాజా వార్తలు కెటిఆర్ ఫన్నీ ట్వీట్…!(వీడియో)

కెటిఆర్ ఫన్నీ ట్వీట్…!(వీడియో)

KTRటిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తాజాగా ఓ ఫన్నీ వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియోలో ఇద్దరు యువకులు ఎంతో కష్టపడి కంచెకు అవతలివైపు ఉన్న మొబైల్ ఫోన్‌ను తీయడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో మొబైల్ ను తీయడానికి వాడుతున్న కర్ర చేయిజారి కంచెకు అవతలివైపు పడిపోతుంది. ఆ పక్కనే ఉన్న మరో యువకుడు కంచె దాటి అవతలివైపు దూకి ఫోన్‌ను కాకుండా కర్రను తీసుకుని వచ్చేస్తాడు. సరదాగా ఉన్న ఈ వీడియోకు కెటిఆర్‌ కూడా స్మార్టెస్ట్‌ గై అవార్డు గోస్‌ టూ… అంటూ పోస్ట్‌ చేశారు. దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తున్నది. వారు సైతం ఇదే తరహాలో ఉన్న వీడియోలను కామెంట్లుగా పెట్టి నవ్వులు పూయిస్తున్నారు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Funny Tweet of TRS Working President KTR get Huge Response