Search
Thursday 15 November 2018
  • :
  • :

పవన్‌కు శ్రీరెడ్డి ‘సారి’ చెప్పాలి: ‘గబ్బర్‌సింగ్’ గ్యాంగ్(వీడియో)

Gabbar Singh gang serious warning to Sri reddy

హైదరాబాద్: టాలీవుడ్ అగ్రనటుడు పవన్ కల్యాణ్ తల్లిని ప్రస్తావిస్తూ నటి శ్రీశక్తి అలియాస్ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన అభిమానులతో పాటు పలువురు సినీ పెద్దలు తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా గబ్బర్ సింగ్ మూవీలో నటించిన రౌడీ గ్యాంగ్ నటులు స్పందించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియాలో… ‘హాయ్, మేము మా దేవుడి టీమ్… గబ్బర్ సింగ్ టీమ్ అంటూ శ్రీ రెడ్డిపై విరుచుకుపడ్డారు. నువ్వు ఎన్ని చిత్రాల్లో నటించావు? సినీ ఇండస్ట్రీలో ఇరవై ఏళ్ల నుంచి ఉన్నాం. నీ ముఖం ఎక్కడ చూడలేదని, 21 క్రాఫ్ట్‌లో ఏ క్రాఫ్ట్‌లో నీకు మెంబర్ షిప్ ఉందని ప్రశ్నించారు. మా అమ్మ.. మా దేవుడు పవన్ కల్యాణ్ అమ్మ గురించి నువ్వు మాట్లాడతావా? ఒక ఆడదానివై ఉండి ఇలా మాట్లాడతావా? తోటి ఆడవాళ్ల గురించి మాట్లాడే పద్దతి ఇదేనా? ఈ విషయంలో మేము కచ్చితంగా వదిలిపెట్టబోమని, పవన్‌కు మీరు క్షమాపణ చెప్పేవరకు ఊరుకునేదే లేదన్నారు. సర్దార్ గబ్బర్ సింగ్‌కు మేమందరం ఉన్నాం. నువ్వు సారి చెప్పేదాకా పవన్ ఫ్యాన్స్ ఊరుకోరు’ అని  శ్రీరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు.

Comments

comments