Home మహబూబ్‌నగర్ గద్వాలకు వరాల జల్లు

గద్వాలకు వరాల జల్లు

Gadwal has been sanctioned a 300-bed hospital

300 పడకల ఆసుపత్రి మంజూరు                                                                                                                          నియోజకవర్గ అభివృద్ధికి రూ.100 కోట్లు                                                                                                                గట్టు ఎత్తిపోతలకు నల్ల సోమనాద్రి నామకరణం                                                                                                          గట్టు, కేటిదొడ్డి మండలాలకు గురుకుల పాఠశాలలు                                                                                                  గుర్రగడ్డ బ్రిడ్జీకి రూ.10 కోట్లు                                                                                                                                  బస్టాండ్ ఆధునీకరణకు రూ.2 కోట్లు
జూరాల బృందావనంకు రూ.15 కోట్లు                                                                                                                      వరాలు కురిపించిన ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ /మహబూబ్‌నగర్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జోగులాంబ గద్వాల జిల్లాకు వరాల జల్లులు కురిపించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని హామీలను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. శుక్రవారం  కరువు నేల నడిగడ్డ ప్రాంతంలోని తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన కెసిఆర్ అనంతరం గట్టు ఎత్తిపోతల పథకం పైలాన్‌ను ఆవిష్కరించి భూమి పూజ చేశారు. అనంతరం  గద్వాలలో జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి గద్వాల జిల్లాకు వరాలు కురిపించారు. నియోజకవర్గ ఇంచార్జీ బండ్ల కృష్ణహన్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి అన్ని హామీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గద్వాలలో ప్రభుత్వ ఆసుపత్రిని 300 పడకల ఆసుపత్రిగా మారుస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఎస్‌సి విద్యార్థులకు కోసం ఎస్‌సి స్టడీ సర్కిల్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.  ఎత్తిపోతల పథకానికి నల్లసోమనాది గట్టు ఎత్తిపోతల పథకంగా నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. కేటిదొడ్డిలో ఎస్‌టి గురుకుల పాఠశాల, గట్టు మండంలో గురుకుల పాఠశాల మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.  అదేవిధంగా ఎంతో కాలంలో గుర్రగడ్డ ప్రజలకు చిరకాల స్వప్నంగా మారిని బ్రిడ్జీనిర్మాణానికి ముఖ్యమంత్రి రూ.10 కోట్లు మంజూరు చేశారు.  ఈ పనులను వెంటనే ప్రారంభించాలని ఐదు నెలల్లో బ్రీడ్జీ నిర్మాణం పూర్తి చేయాలని మంత్రులను ఆదేశించారు. గద్వాల బస్టాండ్ ఆధునీకరణకు రూ.2 కోట్ల నిధులు, జూరాల ప్రాజెక్టు వద్ద బృందావన పార్కుకు రూ.15 కోట్లు తన నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.  గద్వాల జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ నుంచి బండ్ల కృష్ణహన్‌రెడ్డిని దీవించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గట్టు  తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాల సామార్థాన్ని పెంచేలా  డిజైన్లు రూపొందించాలని, వరద జలాలను పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాలమూరు జిల్లాలో 21 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే వరకు కృషి చేస్తామని తెలిపారు. కొంత మంది కాంగ్రెస్ దద్దమ్మలు ప్రాజెక్టులను అడ్డుకునే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కోర్టుల్లో కేసులు వేస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. సభలో ముఖ్యమంత్రి ఒఎస్‌డి స్మితా సబర్‌వాల్, కలెక్టర్ రొనాల్డ్ రోస్, గద్వాల ఇంచార్జీ బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అధ్యత వహించగా, ఎంపి కెశవరావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ , ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, గువ్వల బాల్‌రాజు, రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్,  కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి,   ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రాములు, కిష్టారెడ్డి, గట్టు తిమ్మప్ప,  అబ్రహం, అలంపూర్ మార్కెట్ యార్డు చైర్మన్  విష్ణువర్ధన్‌రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.