Home గాసిప్స్ కారెక్కనున్న డికె అరుణ?

కారెక్కనున్న డికె అరుణ?

DKAruna

మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ టిఆర్ఎస్ లో జాయిన్ అవ్వనుందా?… ఎస్… టిఆర్ఎస్ లో చేరడానికి ఇఫ్పుడు ఆమె సుముఖంగానే ఉందట. తెలంగాణలో ఫిరాయింపుల చట్టానికి సంబంధించి ప్రస్తుతం గొడవ జరుగుతున్నా… టిఆర్ఎస్ లో జాయిన్ అయ్యేవాళ్లు మాత్రం రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నారు తప్ప తగ్గడం లేదు.

ఇది వరకు అరుణ సొంత తమ్ముడు చిత్తెం రామ్మోహన్ రెడ్డి టిఆర్ఎస్ లో జాయిన్ అయినప్పుడు తమ్ముడిపై విరుచుకుపడింది అరుణ. కాని, ఇప్పుడు మాత్రం టిఆర్ఎస్ లోకి వెళ్లడానికి సుముఖంగానే ఉందట. కెసిఆర్ తో సంప్రదింపులు కూడా జరిగాయట. మంత్రి పదవి ఇవ్వడానికి కూడా కెసిఆర్ రెడీగా ఉన్నట్లు సమాచారం.

అయితే, ఆఫీషియల్ గా ఎటువంటి కన్ఫర్మేషన్ లేనప్పటికీ…. అరుణ టిఆర్ఎస్ లో జాయిన్ అవుతుందా లేదా అనేది మాత్రం సస్పెన్సే..