Home టెక్ ట్రెండ్స్ గెలాక్సీ నుంచి నయా స్మార్ట్‌ఫోన్

గెలాక్సీ నుంచి నయా స్మార్ట్‌ఫోన్

Galaxy A8S smartphone launchedముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు సంస్థ శాంసంగ్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ8ఎస్‌ను సోమవారం రిలీజ్ చేసింది. ఇందులో ఇన్ఫినిటీ ఒ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఫోన్ డిస్‌ప్లే పై భాగంలో నాచ్ ఉండే అవకాశం లేదు. కేవలం ఒక్క కెమెరా మాత్రమే ఉంటుంది. ఈ ఫోన్‌లో 6.4 ఇంచుల భారీ డిస్‌ప్లేను అమర్చారు. స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 8 జిబి ర్యామ్‌ ఇందులో ఏర్పాటు చేయడం వల్ల ఈ ఫోన్ స్పీడ్ గా పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో వెనుక భాగంలో 24, 10, 5 మెగాపిక్సల్ కెమెరాలు మూడింటిని ఏర్పాటు చేయడం విశేషం.

ముందు భాగంలో 24 మెగాపిక్సల్ కెమెరా అమర్చాడంతో సెల్ఫీ ప్రియులకు ఇది బాగా నచ్చుతుంది. ఈ కెమెరాలతో తీసుకునే ఫొటోలు, వీడియోలు మంచి క్వాలిటీలో వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఉంది. 3400 ఎంఎహెచ్ బ్యాటరీ బ్యాకప్ అప్ లభిస్తుండగా…  దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ ఫీచర్ కూడా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎ8ఎస్ ఫోన్ బ్లూ, గ్రే, గ్రీన్ కలర్ వేరియెంట్లలో డిసెంబర్ 21వ తేదీ నుంచి కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. దీని ధర వివరాలను మాత్రం ఇంకా సంస్థ వెల్లడించలేదు.

Galaxy A8S smartphone

శాంసంగ్ గెలాక్సీ ఎ8ఎస్ అద్భుత ఫీచర్లు

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే

2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్

6/8 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్

512 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్

24, 10, 5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు

24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్

డ్యుయల్ 4జి వివొఎల్‌టిఇ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యుఎస్‌బి టైప్ సి, ఎన్‌ఎఫ్‌సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి అద్భుత ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి.

Galaxy A8S smartphone launched