Search
Wednesday 14 November 2018
  • :
  • :

ఆయనే ప్రపంచంలో బెస్ట్ టీచర్ : కాజోల్

ముంబయి : మంగళవారం దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. తమకు విద్య నేర్పిన ఉపాధ్యాయులను స్మరించుకుంటూ గౌరవించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ బాలీవుడ్ నటీ కాజోల్ కూడా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంది. కాకపోతే ఆమె కాస్త భిన్నంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప టీచర్ ఆయనే అంటూ వినాయకుడిని టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. వినాయకుడి వద్ద ఆమె ఓ సెల్ఫీ దిగి ఆ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ భాయిజాన్ చిత్రంలోని సెల్ఫీ లే లే అనే పాటని తన పోటోకి క్యాప్షన్ గా పెట్టారు కాజోల్. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరలయింది. ప్రపంచంలోనే గొప్ప గురువు వినాయకుడంటూ గణేష్ నిమజ్జనం రోజున నటి చేసిన సోషల్ మీడియా పోస్టుపై విపరీతమైన స్పందన వస్తోంది.

Comments

comments