Home జిల్లాలు గ్రామాల్లో గణపతి లడ్డూకు డిమాండ్

గ్రామాల్లో గణపతి లడ్డూకు డిమాండ్

ganesh-flపటాన్‌చెరు : గణపతి లడ్డూకు గ్రామాల్లో కూడా డిమాండ్ పెరుగుతుంది. మండలంలోని రామేశ్వరంబండ గ్రామంలో నిర్వహించిన లడ్డూ వేలంలో గ్రామానికి చెందిన యువకుడు శంకర్ రూ.27వేలకు లడ్డూను సొంతం చేసుకున్నాడు. గత నాలుగేళ్లుగా గణపతి లడ్డూను కైవసం చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. లడ్డూను సొంతం చేసుకోవడంతో తమకు అన్ని విధాలుగా కలిసివస్తుందని ఆయన తెలిపారు. దాంతో స్వామివారి లడ్డూను వేలంలో దక్కించుకున్నామని తెలిపారు.