Home మంచిర్యాల గాంధారి జాతరకు పూర్తైన ఏర్పాట్లు

గాంధారి జాతరకు పూర్తైన ఏర్పాట్లు

Gandhari Jatara Arrangements Completed  in Mancheriala

రామకృష్ణాపూర్:  మంచిర్యాలజిల్లా మందమర్రి మండలం తిమ్మాపూర్ గ్రామంచాయతీ పరిధిలోని గాంధారిఖిల్లా వద్ద జాతర నిర్వహించేం దుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మాగశుద్ధ పౌర్ణమి (దేవుళ్లపున్నం) నేటి నుండి ఆదివారం వరకు జాతర నిర్వాహనకు అన్ని వసతులను కల్పించినట్లు గాంధారి ఖిలా ఆలయ కమిటీ ఆదివాసీ నాయక్‌పోడ్ సేవా సంఘం, మందమర్రి ఎంపిపి బొలిశెట్టి కనకయ్య తెలిపారు. గురువారం స్థానిక విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాగశుద్ధ పౌర్ణమి రోజున గాంధారీ మైసమ్మ మొక్కులు చెల్లించి, ప్రత్యేక పూజల తో ఆదివాసులు జాతర చేసుకుంటారన్నారు.

అలాగే శనివారం దేవాతామూర్తులను గోదావరి జలాలతో అభిషేకాలు నిర్వహించి, సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహిస్తారని తెలియజేశారు. ఆదివారం గాంధారి మైసమ్మకు పట్నాలు , పెద్దపూజలు నిర్వహించి, జాతర నిర్వహించిన అంనతరం ధర్బార్ నిర్వహిస్తారని వారు పేర్కొన్నారు.

గాంధారి ఖిల్లాలో దర్శించు స్థలాలు

మంచిర్యాల , ఆసిఫాబాద్ ప్రధాన రహదారి నుండి రాళ్లవాగు దాటి సుమారు 5 కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తే గాంధారిఖిల్లాకు చేరుకోవచ్చు. మట్టిరోడ్డుపై కంకర మొరం వేసి ఉండడంతో కొండవరకు వాహనాలను తీసుకెళ్లవచ్చు. బొక్కల గుట్ట దాటిన వెంటనే ఎడమ వైపు భీమన్న ఆలయం కొలువై ఉంది. సుమారు రెండు కిలోమీటర్ల ప్రయాణం చేయగా ఖిల్లా కింద మిడిచెరువు దానిగుండా నిరంతరం ఉబికి వచ్చే ఊట చెలుమ గలదు. ఖిల్లా మీదికి ప్రయాణం చేస్తుండగా ముఖద్వారానికి ముందు కుడివైపు దాసివారాల గుళ్లు ఉంటాయి. మొదటి ముఖద్వారం వద్ద సుమారు 10 అడుగుల రాతితో స్వాగత తోరణం ఉండి ఖిల్లా మీదికి ప్రయాణంగా భైరవ విగ్రహం రాతితో చెక్కబడి ఆకర్షిస్తుంది. అతి పురాతనమైన పెద్ద ధర్వాజ (ముఖద్వారం) ఆనుకొని మైసమ్మ తల్లివిగ్రహం గలదు. ముందుకు కదులుతుండగా పడమటి గుట్టపై ఏడు తలల నాగదేవత ఏక శిల పై చెక్కబడిన తీరు ప్రధాన ఆకర్షన ఉంటుంది. దాని ముందు రెడ్డి రాజుల నాటి ప్రతాప రుద్రుని శిలాశాసనం రాతిపై చెక్కబడి ఉంది. దాని పక్కనే వీరాంజనేయ రాతి విగ్రహం