Home తాజా వార్తలు గాంధీ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

గాంధీ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

Gandhi Hospital to treat girl with rare disease

హైదరాబాద్‌:  గాంధీ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. అప్పుడే జన్మించిన శిశువుకు అరుదైన శస్త్రచికిత్స చేసి పునర్జన్మను ప్రసాదించారు. నవజాతా శిశువు గొంతులో ఏర్పడిన కణితి కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది నెలకొంది. గమనించిన వైద్యులు వైద్య పరీక్షలు చేసి దీన్నో అరుదైన వ్యాధిగా గుర్తించారు. 24 గంటల్లోపే ఆ శిశువు గొంతు భాగంలో ఉన్న పెద్ద కణితిని పది మంది వైద్యుల బృందం సుమారు రెండు గంటల పాటు శ్రమంచి శస్త్రచికిత్సను విజయవంతంగా ముగించింది. ఇలాంటి శస్త్రచికిత్స ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయటం ఇదే తొలిసారని వైద్యులు పేర్కొన్నారు.