Home జాతీయ వార్తలు గాంధీనే నా హీరో … కమల్

గాంధీనే నా హీరో … కమల్

MNM Chief Kamalచెన్నయ్ : జాతిపిత మహాత్మా గాంధీ తనకు ఎప్పుడూ హీరోనేనని విశ్వ నటుడు, ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్ స్పష్టం చేశారు. జాతిపితను హత్య చేసిన నాథూరాం గాడ్సే ఎప్పటికీ విలనేనని, ఎప్పటికీ గాడ్సే హీరో కాలేడని ఆయన తేల్చి చెప్పారు. గాంధీ రైలులో ప్రయాణం చేస్తున్న సమయంలో ఆయన చెప్పు ఒకటి పోయిందని, దీంతో ఆయన తన రెండో చెప్పును కూడా కిందపడేశాడని, మొదటి చెప్పు దొరికిన వ్యక్తికి రెండో చెప్పు కూడా పనికొస్తుందన్న ఉద్దేశంతోనే గాంధీ ఇలా వ్యవహరించారని కమల్ పేర్కొన్నారు. గాంధీ హత్యకు గురైన రోజున ఆయన కళ్లద్దాలు, చెప్పులు పోయిన విషయం ఈ మధ్యనే తనకు తెలిసిందని కమల్ చెప్పారు. స్వతంత్ర భారత్ లో తొలి ఉగ్రవాది హిందువని కమల్ ఇటీవల వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆయన స్పందించారు. ఓ విలన్ ను తాను ఎప్పటికీ హీరోగా అంగీకరించబోనని ఆయన తేటతెల్లం చేశారు. ఇటీవల తనపై జరిగిన చెప్పుల దాడిపై కూడా కమల్ స్పందించారు. తనపై చెప్పులతో దాడి చేసిన వ్యక్తికే అది అవమానమని ఆయన పేర్కొన్నారు.

Gandhi is My Hero : MNM Chief Kamal