Search
Sunday 19 August 2018
  • :
  • :
Latest News

జిన్నాను గాంధీ ప్రధాని చేయాలనుకున్నారు

dalailama

పానాజి: మహమ్మద్ అలీ జిన్నాను మహాత్మాగాంధీ భారతదేశానికి ప్రధానిని చేయాలని భావించారని, అందుకు జవహార్ లాల్ నెహ్రూ తిరస్కరించినట్లు బౌద్ధమత ఆధ్యాత్మిక గురువు దలైలామా తెలిపారు. గాంధీ కోరినట్లు జిన్నా ప్రధాని అయితే దేశ విభజన జరిగి ఉండేది కాదన్నారు. బుధవారం గోవాలోని సంఖ్లిం పట్టణంలో గోవా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నిర్వహించిన కార్యక్రమంలో దలైలామా ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యారులు ్థ అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. నిర్ణయాలు తీసుకోవడంలో పొరపాట్లు కూడాజరుగుతాయని పేర్కొన్నారు. జిన్నాను ప్రధానిని చేసేందుకు గాంధీ ఎంతో ఆసక్తిని చూపినప్పటికీ, తానే తొలి ప్రధానిని కావాలనే ఉద్దేశంతో నెహ్రూ అందుకు తిరస్కరించారని దలైలామా పేర్కొన్నారు. నెహ్రూ తెలివిగల, మంచి అనుభవజ్ఞుడని, అయితే అప్పుడప్పుడు పొరపాట్లు కూడా జరగుతుంటాయని ఆయన పేర్కొన్నారు.

Comments

comments