Home ఆఫ్ బీట్ వీడియోలు మతసామరస్యాన్ని చాటిన గణేష్ ఊరేగింపు..(వీడియో)

మతసామరస్యాన్ని చాటిన గణేష్ ఊరేగింపు..(వీడియో)

Ganesh chaturthi celebrations at Ceuta

మాడ్రిడ్: వినాయక చవితి పండుగ ఇండియాలో ఎంత ఘనంగా జరుగుతుందో విదేశాల్లోనూ కొన్ని చోట్ల అంతే అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తాజాగా సోషల్ మీడియాలో స్పెయిన్ లో గతేడాది జరిగిన గణేష్ చతుర్థీకి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. లంబోధరుడి నిమజ్జనం ఊరేగింపుకు సంబంధించిన వీడియో అది. వీధుల్లో కావడిపై గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం కోసం ఊరేగింపుగా తీసుకువెళ్తున్నారు. బ్యాండ్ బాజాలతో కోలహలంగా జరుగుతుంది ఆ ఊరేగింపు. ఆ సమయంలో ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఊరేగింపు మధ్యలో వారికి క్రైస్తవులు పవిత్ర స్థలంగా భావించే చర్చీ ఎదురైంది. ఊరేగింపుగా వెళ్తున్న గణేషుడి ప్రతిమను తమ చర్చీలోకి ఆహ్వానించారు వారి మత పెద్దలు. తమకు వినాయకుడి ఆశ్వీరదాలు అందించాలని వారు కోరారు. దీంతో లంబోధరుడిని చర్చీలోకి తీసుకెళ్లారు. అక్కడ కొద్దిసేపు ‘గణపతి బొప్ప మోరియా’ అంటూ నినాదాలతో మారుమోగించారు. ఇలా అక్కడి వారు మతసామరస్యాన్ని చాటుకున్నారు. ఈ ఘనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.