Home తాజా వార్తలు ఖైరతాబాద్ మహాగణపతికి జంధ్యం, కండువా సమర్పణ

ఖైరతాబాద్ మహాగణపతికి జంధ్యం, కండువా సమర్పణ

Khairatabad-Ganeshహైదరాబాద్: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి వద్ద భక్తుల కోలాహలం మొదలైంది. వినాయక చవితి సందర్భంగా వందలాది మంది భక్తులు మహాగణపతిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. తొలిరోజున ఉదయం పద్మశాలి సంఘం గణపతికి 75 అడుగుల కండువా, జంధ్యం, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయం 10 గంటలకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు వినాయకుడికి తొలిపూజ నిర్వహించనున్నారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ తయారుచేసిన 500 కిలోల లడ్డు వినాకుడి వద్దకు చేరుస్తారు.