Search
Sunday 23 September 2018
  • :
  • :

వినాయక నిమజ్జనానికి  ముందస్తు ప్రణాళిక

choba*పద్మాక్షిగుండంలో నిమజ్జనంలేదు *మట్టి విగ్రహాలనే ఉపయోగించాలి
*అధికారులు, ఉత్సవ కమిటీలు సమన్వయంగా ఉండాలి *డిఆర్‌ఒ శోభ
వరంగల్ ప్రతినిధి: వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే వినాయక విగ్రహాల నిమజ్జనంనకు అధికారులు, ఉత్సవ కమిటీలు పరస్పర సహకారంతో పటిష్టమైన ప్రణాళికను ముందుస్తుగా రూ పొందించి అమలు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. శోభ కోరారు. సోమవారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో వినాయక చవితి పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడారు. భక్తులు మట్టి విగ్రహాలనే ఉపయోగించాలని ఆమె సూ చించారు. జిల్లా విద్యాశాఖ ఎంపిక చేసిన పాఠశాల నుంచి మట్టివినాయకులను తయారు చేసి  ఉచితంగా పంపిణీ చేడయం జరుగుతుందన్నారు. హన్మకొండలోని పద్మాక్షి గుండంను మంచినీటి రిజర్వాయర్‌గా ఉపయోగించనున్న నేపథ్యంలో పద్మాక్షి గుండంలో వినాయక నిమజ్జనాలు చేయవద్దని డిఆర్‌వో సూచించారు. బంధం చెరువు, సిద్దేశ్వర ఆలయగుండం, చిన్న వడ్డేపల్లి చెరువు, రంగం చెరువు, బెస్తం చెరువు, కట్టమల్లన్న చెరువులలో విగ్రహాలను నిమజ్జనం చేయాలన్నారు. నిమజ్జనం చేసే చెరువులను పరిశుభ్రంగా ఉండే విధంగా సంబంధితశాఖ అధికారు లు చర్యలు తీసుకోవాలని,అలాగే చెరువుల వద్ద గజ ఈతగాళ్లను ఏ ర్పాటు చేయాలన్నారు. ఈసమావేశంలో పోలీసు, అగ్నిమాపక, మ త్సశాఖ, విద్యుత్‌శాఖ, మున్సిపల్, ఆర్‌అండ్‌బి, ఇరిగేషన్,దేవాదా య, వైద్య ఆరోగ్యశాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

comments