Saturday, April 20, 2024

‘భగవంత్ కేసరి’ నుంచి హైలీ ఎనర్జిటిక్ గణేష్ సాంగ్ విడుదల

- Advertisement -
- Advertisement -

‘భగవంత్ కేసరి’ మేకర్స్ రెండు రోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ గణేష్ సాంగ్ ప్రోమోతో అలరించారు. ఈరోజు పూర్తి లిరికల్ వీడియోను విడుదల చేశారు. మాస్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ , శ్రీలీల గణేష్ చతుర్థి సెలబ్రేట్ చేసుకుంటూ బాబాయ్ అమ్మాయిగా సందడి చేశారు.

గణేష్ పాట కోసం ఎస్ఎస్  థమన్ పెప్పీ, మాస్ ట్యూన్ కంపోజ్ చేసారు. తెలంగాణ యాసలో ఉన్న ఈ పాట ఆర్కెస్ట్రేషన్ ఆకట్టుకుంది. కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యం మాస్‌ని కట్టిపడేసింది.  కరేముల్లా, మనీషా పాండ్రంకి ఈ పాటను హై-పిచ్డ్ వోకల్స్ తో ఎనర్జిటిక్ గా అలపించారు.

బాలకృష్ణ, శ్రీలీల తమ క్రేజీ డ్యాన్స్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. వారి కాస్ట్యూమ్‌ లు,  గెటప్‌ లు , డ్యాన్స్‌లు అన్నీ పాటకు పర్ఫెక్ట్‌గా అనిపించాయి. విజువల్స్ అద్భుతంగా వున్నాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ బ్రిలియంట్ గా వుంది. పోస్టర్లు, ప్రోమోలు సెట్ చేసిన అంచనాలను ఈ పాట అందుకుంది.

దర్శకుడు అనిల్ రావిపూడి పాటల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ మ్యూజికల్ జర్నీని చార్ట్‌బస్టర్ నోట్‌లో ప్రారంభించింది. సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. జాతీయ అవార్డు విజేత అర్జున్ రాంపాల్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రానికి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి విడుదల కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News