Home తాజా వార్తలు పేట్లబురుజు దోపిడి కేసును చేధించిన పోలీసులు

పేట్లబురుజు దోపిడి కేసును చేధించిన పోలీసులు

TS-Police-Logo

హైదరాబాద్:  పాతబస్తీలోని పేట్లబురుజు దోపిడి కేసును పోలీసులు చేధించారని హైదరాబాద్ సిపి అంజనీకుమార్ తెలిపారు. మహారాష్ట్ర లోని థానేలో గ్యాంగ్ లీడర్ అంజద్ ఖాజాను పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. ఈ దోపిడి కేసులో తొమ్మిది మంది పరారీలో ఉన్నారని వెల్లడించారు. ఆరు లక్షల రూపాయలు విలువ ఆభరణాలను వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని సిపి పేర్కొన్నారు.