Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

తల నరికి తెస్తే 5లక్షలు ఇస్తా: సంజీవ్ మిశ్రా

Gang Rape and murder of 8 Year old Girl In Lucknow

లక్నో: బిజెపి నేత సంజీవ్ మిశ్రా మరో వివాదంలో చిక్కుకున్నారు. మంద్‌సౌర్ గ్యాంగ్‌రేప్ కేస్ నిందితుని తల నరికి తెస్తే రూ.5 లక్షలు ఇస్తానని ఆయన ప్రకటించడం వివాదం రేపుతున్నది. మంద్‌సౌర్ లో 8 ఏళ్ల బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ పై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైన విషయం తెలిపిందే. ఈ కేసులో  నిందితున్ని ఎట్టి పరిస్తితుల్లోనూ వదిలి పెట్టబోమని మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ స్పష్టం చేశారు. బాధిత చిన్నారి తండ్రికి రూ.5లక్షలు ఇచ్చారు.అయితే ఆ డబ్బు తీసుకోవడానికి ఆయన నిరాకరించాడు. తనకు డబ్బు అవసరం లేదని, నిందితున్ని ఉరి తీయాలని చిన్నారి తండ్రి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా  బిజెపి నేత సంజీవ్ మిశ్రా మాట్లాడుతూ..నిందితుడికి కఠిన శిక్ష విధించాలి, కోర్టు లేదా ప్రభుత్వం ఆ పని చేయలేకపోతే అతని తల నరికి తెచ్చిన వారికి నేనే 5 లక్షలు ఇస్తా అని అన్నారు.

 

 

 

Comments

comments