Home జాతీయ వార్తలు అమానుషం: భూమి అమ్మలేదని గ్యాంగ్ రేప్ ఆపై కాల్పులు

అమానుషం: భూమి అమ్మలేదని గ్యాంగ్ రేప్ ఆపై కాల్పులు

gang-rape-done-in-ptsలక్నో: మహిళలపై అమానుష చర్యలు రోజురోజుకు అధికమవుతున్నాయి. మానవ మృగాలు ఎప్పుడు పంజా విసురుతాయో తెలియని పరిస్థితి. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ ప్రాంతంలో దారుణం జరిగింది. భూమి అమ్మలేదనే కోపంతో 34 ఏళ్ల వివాహితపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఆమెపై కిరాతకంగా కాల్పులు జరిపి పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బాధితురాలి కుటుంబానికి చెందిన భూమిని, నిందితులకు అమ్మడానికి ఆమె భర్త నిరాకరించాడు. దాంతో ఆగ్రహానికి గురైన సదరు నిందితులు ఆమెను ఇంటినుంచి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె కాళ్లపై కాల్పులు జరిపి పారిపోయారు. బాధితురాలి భర్త పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి, నిందితులు మున్నా, కల్లూ, గఫ్పార్, కలీంలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గత శనివారం రాత్రి జరిగినట్లు తెలిసింది.