Home జాతీయ వార్తలు యుపిలో యువతిపై గ్యాంగ్ రేప్

యుపిలో యువతిపై గ్యాంగ్ రేప్

Gang Rapeలక్నో : యుపిలో ఓ 23 ఏళ్ల యువతిపై నలుగురు దుండగులు  సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం రాత్రి ముజఫర్‌నగర్‌ నగరంలోని జబేపూర్‌ గ్రామంలో జరిగింది. ఈ గ్రామానికి  చెందిన యువతి(23) ఇంట్లో ఉన్న సమయంలో నలుగురు దుండగులు కిడ్నాప్‌ చేశారు. కారులో ఆమెను గ్రామ శివారులోని చెరుకు తోటలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని బయట చెబితే చంపుతామని దుండగులు బాధిత యువతిని బెదిరించి విడిచి పెట్టారు. ఈ క్రమంలో ఇంటికి చేరుకున్న బాధిత యువతి తనపై జరిగిన అఘాయిత్యంపై కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  వైద్య పరీక్షల కోసం బాధిత యువతిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Gang Rape on Woman in UP on Saturday Night