Home కరీంనగర్ బాలికపై సామూహిక అత్యాచారం

బాలికపై సామూహిక అత్యాచారం

Gang-Rape-manatelanganaవీణవంక : మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాలిక (14)పై అదే గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. అనాథ బాలిక తన అమ్మమ్మ ఇంట్లో ఆశ్రయం పొందుతోంది. బాలిక అమ్మమ్మ ఐదు నెలల క్రితం వేరే ప్రాంతాలకు వలస వెళ్లింది. ఈక్రమంలో గ్రామానికి చెందిన యువకులు శ్రీకాంత్, కల్యాణ్, కుమారస్వామి, మొండయ్య, వినోద్ బాలికను గ్రామంలోని చెరువు కట్టవద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరూ లేని బాలిక జరిగిన దారుణాన్ని ఎవరికి చెప్పుకోలేకపోయింది. దీన్ని ఆసరాగా చేసుకున్న యువకులు జరిగిన ఘటనను ఎవరికైనా చెప్తే చంపేస్తామంటూ బెదిరించి పలుమార్లు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. రెండు రోజుల క్రితం బాలిక అమ్మమ్మ స్వగ్రామానికి తిరిగి రాగా జరిగిన దారుణాన్ని ఆమెకు చెప్పింది. దీంతో బాలిక అమ్మమ్మ వీణవంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కిరణ్ తెలిపారు.