Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

యుపి: జైలులో గ్యాంగ్ స్టార్ కాల్చివేత

Gang-star

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం భాగ్ పాఠ్ జైలు మున్నా భజరంగా అనే గ్యాంగ్ స్టార్ ను తోటి ఖైదీలు షూట్ చేసి చంపిన ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. కొద్ది రోజుల క్రితం భజరంగా భార్య సీమా సింగ్… తన భర్తకు ప్రాణహాని ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకుంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు తన భర్తను చంపుతారని పలుమార్లు ఆమె ఆరోపణలు కూడా చేసింది. అమె అనుకున్నట్టుగానే భజరంగ్ ను తోటి ఖైదీ లు చంపారు. జైలులోకి గన్స్ ఎలా వచ్చాయనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 40 హత్య కేసులలో ప్రేమ్ ప్రకాశ్ సింగ్ అలియాస్  భజరంగా నిందితుడిగా ఉన్నాడు. బిజెపి ఎంఎల్ఎ క్రిష్ణానంద్ రాయ్ ను రెండు సార్లు హత్య చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. గత ఎన్నికలలో జైలు నుంచి పోటీ చేసి 12 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని యుపి సిఎం యోగి ఆదిత్యనాధ్ పోలీసులకు ఆదేశారు జారీ చేశారు.

Comments

comments