Home జాతీయ వార్తలు పోలీసు కాల్పుల్లో నలుగురు మృతి

పోలీసు కాల్పుల్లో నలుగురు మృతి

Gangster Rajesh Bharti, 3 aides, shot dead by police

ఢిల్లీ : ఢిల్లీలోని ఛతర్‌పూర్ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం కాల్పులు జరిగాయి. ఢిల్లీ పోలీసులు, గ్యాంగ్ స్టర్ రాజేశ్ భారతి గ్యాంగ్‌కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో రాజేశ్ భారతి గ్యాంగ్‌కు చెందిన నలుగురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురు పోలీసులు సైతం తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన పోలీసులను ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో రాజేశ్ భారతి కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. హరియాణా పోలీసుల కస్టడీ నుంచి ఇటీవల రాజేశ్ భారతి తప్పించుకున్న విషయం తెలిసిందే. రాజేశ్ భారతిపై పలు కేసులు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయనపై లక్ష రూపాయల రివార్డును పోలీసులు ప్రకటించారు. ఈ కాల్పులతో ఢిల్లీ నగరం ఉలిక్కిపడింది. ఈ క్రమంలో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు.

Gangster Rajesh Bharti, 3 aides, shot dead by police