Search
Thursday 15 November 2018
  • :
  • :

ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి

pdsu

మన తెలంగాణ/(కామారెడ్డి)విద్యానగర్: రాష్ట్ర వ్యా ప్తంగా ఉన్న ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సిపిఐ ఎంఎచ్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కట్ల భూమన్న అన్నారు. ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్‌యు కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రోటరీ క్ల బ్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి రాజకీయ శిక్షణలో భాగంగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయ న విద్యార్థి సంఘం నిర్మాణం, పనివిధానం అనే అం శంపై మాట్లాడుతూ విద్యార్థి త్యాగాల పునాదుల మీ ద తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, విద్యార్థులకు ఉద్యోగ అ వకాశాలు కల్పించడంలో విఫలమైందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాల జాతర అని ఇంటికో ఉద్యోగం అని ప్రకటించిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ మాట మర్చిపోయారన్నారు. రా ష్ట్రంలో సుమారు 7లక్షల 75 వేల ఖాళీలు ఉన్నాయని ఇప్పటి వరకు నోటిఫికేషన్ వేయకపోవడం సిగ్గుచేటన్నారు. అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని, విద్యా,వైద్యా రంగాన్ని పూర్తిగా భ్రస్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాలు లు నాణ్యమైన విద్యను, వైద్యంను పూర్తిగా ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. వెంటనే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, లేకపోతే నిరుద్యోగ యువకులు ,విద్యార్థులు పె ద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంంలో సురేష్, విఠల్, రాజు, సురేష్, సత్య, నరేష్, హేమలత, అమీర్, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments