Home అంతర్జాతీయ వార్తలు అమెరికాలో గ్యాస్ పేలుళ్లు

అమెరికాలో గ్యాస్ పేలుళ్లు

Fire-Accident-in-Amrica

Gas Explosions @ North Boston

న్యూయార్క్: అమెరికాలో శుక్రవారం ఉదయం గ్యాస్ పైప్ లైన్స్ పేలిపోయాయి. బోస్టన్ సమీపంలోని మసాచుసెట్స్ నగరంలో 70 చోట్ల పేలుళ్లు జరిగాయని స్థానిక ఆధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో  ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.  పైపులు నుంచి గ్యాస్ లీక్ కావడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని బోస్టన్ ప్రభుత్వం వెల్లడించింది.  ఈ ప్రమాదంలో 100 ఇండ్లు కాలిపోయాయని స్థానిక మీడియా వెల్లడించాయి. భారీగా ఆస్తి నష్టం జరిగిందని, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని అగ్నిమాపక అధికారి మైఖేల్ తెలిపారు. పేలుడు జరిగిన ప్రాంతాలలో నివసిస్తున్న 80,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలు చోట్ల భారీ పేలుళ్లతో పది మీటర్ల లోతు నుంచి 50 మీటర్ల లోతు వరకు గుంతలు పడ్డాయి.