Home జిల్లాలు సబ్సిడీ గ్యాస్ మాఫియా

సబ్సిడీ గ్యాస్ మాఫియా

 యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న గ్యాస్ ఏజెన్సీలు
 ఇళ్ల మధ్యనే రీఫిల్ చేస్తున్న అక్రమ వ్యాపారులు
 రాష్ట్ర సివిల్ సప్లయి కమిషనర్ ఆదేశిస్తే తప్ప దాడులు చేయని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు
 మామూళ్ల మత్తులో జోగుతున్న సివిల్ సప్లయి, అగ్నిమాపక అధికారులు!

Untitled-1వనపర్తి: వనపర్తిలో కొందరు దళారులు గ్యాస్ ఏజెన్సిలతో కుమ్మకై అక్రమ వ్యాపారాలు నిబంధనలకు విరుద్ధ్దంగా ప్ర భుత్వ సబ్సిడీ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ లక్ష ల రూపాయాల ప్రభుత్వ ఆదాయానికి గండికోడుతున్న ప్పటికి సివిల్ సప్లయి,అగ్నిమాపక అధికారులు మాముళ్ల మత్తులో పడి ఉద్యోగ దర్మాన్ని విస్మరిస్తున్నట్లు ఆరోపణలు వున్నాయి.నిజమైన లబ్ధిదారులకు గ్యాస్ కావలంటే రోజుల తరబడి వేచి వుండి గడువు రోజు క్యూలో గంటల తరబడి నిలిచి వుంటే తప్పా గ్యాస్ కుండను తీసుకునే పరిస్థితి లేదు. అక్రమ వ్యాపారులకు ఏలాంటి గ్యాస్ బుక్కింగ్ గానీ ,కనెక్ష న్‌కు సంబంధించిన పుస్తకం కానీ,మంజూరు పత్రం గానీ లేకపోయినా వారికి రోజుకు సిలిండర్లు వస్తున్నాయి.14 కే జీల సబ్సిడీ సిలిండర్లతో రెండు, మూడు కేజీల చొప్పున చిన్న సిలిండర్లకు అక్రమంగా రిఫిల్ చేస్తూ లక్షల రూపా యాలు రోజుకు చేతులు మారుతున్నాయి. పట్టణంలోని ఒ కటి ,రెండు గ్యాస్ ఏజెన్సిలు తెల్లవారు జామున 4 నుంచి 5గంటల వ్యవధిలో ఒక ఆటోలో తరలిస్తూ ఒకటి,రెండు రోజులు వ్యాపారానికి సంబంధించిన సిలిండర్లను నిల్వ వు ంచుతూ,ఒక్కొ సిలిండర్ దగ్గర దాదాపు రూ.1000కి అక్ర మ వ్యాపారులకు గ్యాస్ ఏజెన్సీలు విక్రయిస్తుండగా,వారు మూడు కిలోల చిన్న సిలిండర్‌ను రిఫిల్ చేస్తే ఒక్కదానికి రూ.500 నుంచిరూ.700 దాకా వసూలు చేస్తూ 14 కిలో ల సిలిండర్ ఒక్కదాన్ని నుంచి 5,6 చిన్న సిలిండర్లను నిం పుతూ రూ.మూడువేలకు పైగా అక్రమంగా ఒక్కొ సిలిండర్ నుండి సంపదిస్తున్నారు.

కొత్తకోట రోడ్డులోని ఒక షాపులో ఈ నెల 5వ తేదిన ఆరు సబ్సిడి సిలిండర్లు ,రెండు కమర్షియల్ సిలిండర్లను రాష్ట్ర సివిల్ సప్లయి కమిషనర్ ఆదేశాల మేరకు దాడులు చేసి పట్టుకు న్నారు. నిత్యావసరానికి ఉపయోగించే రాయితి సిలిండర్లను అక్రమ వ్యాపారానికి ఉపయోగించిన వారికి పిడి యాక్ట్ ఉప యోగించాల్సిన అధికారులు 6ఎ కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు.ఇండ్ల మద్యనే ఒక సిలిండర్ నుండి మరో సిలిండర్‌కు గ్యాస్‌కు నింపే సందర్బంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంటే అతిపెద్ద బ్లాస్టింగ్‌తో పరిసరా ప్రాంతాల్లో వున్న ప్రజలకు, ఆస్తులకు, ప్రాణ, ధన నష్టం భారీగా వాటిల్లే ప్రమా దం వుంది. ఈ నిబంధనలను దృష్టిలో వుంచుకోని దాడులు చేసి అక్రమాన్ని ఆరికట్టాల్సిన అగ్నిమాపక సిబ్బంది కూడా మా ముళ్ళ మత్తులో పడి గత కొన్ని సంవత్సరాల నుండి ఒక్క కేసు నమోదు చేయకపోవడం వారి పనితీరు ఎంత పెద్దమొత్తంలో పనిచేస్తున్నారో అర్థమవుతుంది.
గ్యాస్ రిఫిల్ సమయంలో భారీ విస్పోటం జరిగితే మరి దానికి బాధ్యత రెవెన్యూ శాఖ,సివిల్ సప్లయి, అగ్నిమాపక శాఖ ,తునికల కొలతల శాఖల అధికా రులు పూర్తిగా బాధ్యత వహించాల్సి వుంటుంది.సిలిండర్లు సరిగ్గా రిఫిల్ చేయకపోవడంతో కొత్తకోట రోడ్డులో వున్న ఒక షాపులో రిఫిల్ సిలిండర్ తీసుకున్న నాగవరం గ్రామానికి చెందిన దోమ్మరి జమ్మన్న అనే వ్యక్తి పురిగుడిసెలో సిలిండర్ పెలి పూర్తిగా వంటసామగ్రి,పుడిగుడిసెతో పాటు ఆస్తి నష్టానికి కారణమైంది. అలాగే కొత్తకోట రోడ్డులోని ఒక గ్యాస్ అక్రమ వ్యాపారి మున్సిపల్ నిబంధనలకు విరుద్దంగా భవనాన్ని నిర్మిం చారని ,మున్సిపల్ అధికారులు అతనిపై చర్యలు తీసుకునేం దుకు నోటిసులు తయారు చేస్తున్నుట్లు తెలుస్తుంది.