Home తాజా వార్తలు పాక్‌ మాజీ క్రికెటర్‌కు గౌతీ ఘాటు సమాధానం!

పాక్‌ మాజీ క్రికెటర్‌కు గౌతీ ఘాటు సమాధానం!

Gautam Gambhir slams Tanvir Ahmed for Virat Kohli

న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీపై నోరు పారేసుకున్న పాక్ మాజీ క్రికెటర్ తన్వీర్‌ అహ్మద్ కు గౌతం గంభీర్ ఘాటుగా సమాధానమిచ్చాడు. ఇటీవల విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో విరాట్ ఆసియాకప్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో కోహ్లీపై తన్వీర్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఆసియాకప్‌ నుంచి కోహ్లీ పారిపోయాడని వ్యాఖ్యానించాడు. తన్వీర్ మీడియాతో మాట్లాడుతూ… ‘నా అంచనా ప్రకారం పాకిస్థాన్‌ జట్టుకు భయపడే విరాట్ ఆసియాకప్‌ నుంచి పారిపోయాడు. దేశం కోసం ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆడిన వ్యక్తి ఆసియాకప్‌ ఆడలేడా?. టీమిండియా పాక్తో ఫైనల్స్‌తో సహా మూడు సార్లు తలపడాల్సివస్తుందని కోహ్లీ ముందే ఊహించి ఉంటాడు. అందుకే ఎస్కేప్‌ అయ్యాడు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇక కోహ్లీపై తన్వీర్ చేసిన వ్యాఖ్యలపై భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ‘విరాట్‌ పేరుమీద ఇప్పటికే 35-36 సెంచరీల రికార్డు ఉంది. అతనికి మరో సెంచరీ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. అదే తన్వీర్‌ పేరుమీద కనీసం 36 ఇంటర్నెషనల్ మ్యాచ్‌లు ఆడిన దాఖలాలు లేవు. అది గుర్తు పెట్టుకుంటే మంచిది’ అంటూ కౌంటర్ ఎటాక్ చేశాడు గౌతీ.

Gautam Gambhir slams Tanvir Ahmed for Virat Kohli.

Telangana Breaking News