Home తాజా వార్తలు ఈ ‘గాయత్రి’ పటేల్ ప్రతి పేజీ.. క్రైం పేజేనట!(ట్రైలర్)

ఈ ‘గాయత్రి’ పటేల్ ప్రతి పేజీ.. క్రైం పేజేనట!(ట్రైలర్)

Gayatri-Trailer

హైదరాబాద్: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో నటించిన చిత్రం ‘గాయత్రి’. ఆదివారం ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. మదన్‌ రామిగాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మంచు విష్ణు, శ్రియ శరణ్, అనసూయ భరద్వాజ్‌, నిఖిలా విమల్‌  ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ట్రైలర్ లో ‘రామాయణం ఒక ఆడదాని ఏడుపు వల్ల జరిగింది.. భారతం ఒక ఆడదాని నవ్వు వల్ల జరిగింది’, ‘ప్రాణం ఇచ్చే పంచభూతాలు రెండో పేజీ ఓపెన్‌ చేస్తే ప్రళయ తాండవమే వస్తుంది’,  ‘ఈ గాయత్రి పటేల్‌ ప్రతీ పేజీ క్రైం పేజీరా’,  ‘దేవుడు చాలా మంచి వాడు రాక్షసులకు కూడా వరాలు ఇస్తుంటాడు’ అని మోహన్‌బాబు పలికిన డైలాగ్స్ హైలైట్‌గా ఉన్నాయి. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ బ్యానర్‌పై మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ తరంగ్ ఎస్ఎస్ థమన్ స్వరాలు అందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీని త్వరలోనే విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. తాజాగా విడుదలైన ‘గాయత్రి’ ట్రైలర్ మీకోసం…