Home ఛాంపియన్స్ ట్రోఫీ చెలరేగిన గేల్, కోహ్లీ.. బెంగళూరు 213/2

చెలరేగిన గేల్, కోహ్లీ.. బెంగళూరు 213/2

Virat-Gayle

రాజ్ కోట్ : ఐపిఎల్ 10లో భాగంగా మంగళవారం గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ చెలరేగిపోయారు. గుజరాత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టు ఓపెనర్లు గేల్, కోహ్లీ ఆది నుంచి దూకుడు ప్రదర్శించారు. ప్రతి బాల్ ని బౌండరీలు బాదుతూ గేల్ గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. విరాట్ కూడా తనదైన స్టైల్ బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. గేల్ 38 బంతుల్లో 7 సిక్సులు, 5 ఫోర్లతో 77 పరుగులు చేయగా, కోహ్లీ 50 బంతుల్లో 1 సిక్స్, 7 ఫోర్లతో 64 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు జట్టు 2 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. గుజరాత్ బౌలింగ్ లో కులకర్ణీ, బాసిల్ చెరో వికెట్ తీశారు.