Search
Sunday 23 September 2018
  • :
  • :

తక్కువ స్క్రీన్ టైమ్

Geetha Govindam BLOCKBUSTER Song

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న క్రేజీ హీరోయిన్ల లిస్టులో రష్మిక మందన్న పేరు కూడా చేరిపోయింది. టాలీవుడ్‌లో తన తొలి సినిమా ‘ఛలో’తో హిట్ సాధించిన ఈ కన్నడ బ్యూటీ రెండో సినిమా ‘గీత గోవిందం’తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. దీంతో ఆమెది లక్కీ హ్యాండ్ అనే టాక్ వచ్చేసింది. ఇక రష్మిక చేస్తున్న నెక్స్ ఫిలిం ‘దేవదాస్’ ఓ క్రేజీ ప్రాజెక్టు. నాగార్జున, నాని కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాలో రష్మిక నానీకి జోడీగా నటిస్తోంది.  ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ “మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా కావడంతోనే ‘దేవదాస్’ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. అంతేకానీ స్క్రీన్ టైమ్ గురించి నేను పట్టించుకోలేదు”అని చెప్పింది. దీనర్థం సినిమాలో రష్మికు తక్కువ స్క్రీన్ టైమ్ ఉంటుందన్నమాట. ఈ సినిమా కాకుండా విజయ్ దేవరకొండతో మరోసారి ‘డియర్ కామ్రెడ్’లో నటిస్తోంది. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.

Comments

comments