Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

అప్పుడు కాస్త కుదుటపడ్డా

బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్ చిత్ర పరిశ్రమలో డైరెక్టర్‌గా అడుగుపెట్టి పదేళ్లయింది. యువత, సోలో, ఆంజనేయులు, సారొచ్చారు. శ్రీరస్తు శుభమస్తు చిత్రాలను ఆయన చేశారు. వీటి తర్వాత ఆయన చేసిన ‘గీత గోవిందం’ 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటిస్తూ పరశురామ్ చెప్పిన విశేషాలు…

Parusharam

అద్భుతమైన స్పందన…

రెండు వారాల క్రితం విడుదలైన ‘గీత గోవిందం’ చిత్రానికి ప్రపంచంలోని అన్ని ఏరియాల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమాకు రికార్డు కలెక్షన్లు రావడంతో ఆనందంగా ఉంది. అల్లు అరవింద్, బన్నీవాసు, విజయ్ దేవరకొండలకు థాంక్స్.
పెద్ద స్థాయిలో నిలబెట్టింది…

రెండేళ్ల క్రితం ‘గీత గోవిందం’ చిన్న సినిమాగా మొదలైంది. అయితే విడుదలైన తర్వాత పెద్ద సినిమా తరహాలో సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇక నేను డైరెక్టర్ అయి పదేళ్లయింది. 2008లో నా తొలి సినిమా విడుదలైంది. మొత్తం ఆరు సినిమాలు డైరెక్ట్ చేశాను. వాటిలో సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్ ఉన్నాయి. కానీ ‘గీత గోవిందం’ దర్శకుడిగా, రచయితగా నన్ను పెద్ద స్థాయిలో నిలబెట్టింది.

ప్రేక్షకులే చెప్పాలి…

క్రిష్ పదేళ్లుగా నాకు మంచి ఫ్రెండ్. అప్పటి నుంచి ఆయన నన్ను చూస్తున్నారు. అందుకే ఆయన నన్ను స్టార్ లీగ్‌లో చేరాల్సిన డైరెక్టర్ అని ప్రీ రిలీజ్ వేడుకలో అన్నారు. రూ.100 కోట్లతో స్టార్ లీగ్‌లో చేరామా, లేదా అన్నది ప్రేక్షకులే చెప్పాలి. మంచి కథకు విజయ్ దేవరకొండ హీరోగా తోడయ్యాడు. కథకు అన్నీ సెట్ అయ్యాయి. గీతా ఆర్ట్ బ్యానర్‌తో కాస్టింగ్ అంతా చక్కగా కుదిరింది.

చాలా టెన్షన్ పడ్డా…

మరో నాలుగు, ఐదు రోజుల్లో ‘గీత గోవిందం’ విడుదలవుతుందనగా సినిమాలోని సీన్లు లీక్ కావడంతో చాలా టెన్షన్ పడ్డాను. కానీ అల్లు అరవింద్ ఫోన్ చేసి 10, 12 గంటల్లో అంతా సెట్ అవుతుందని నాతో చెప్పారు. అప్పుడు కాస్త కుదుటపడ్డాను. ఎందుకంటే ఈ సినిమా నా బేబీలాంటిది. గీతతోనూ, గోవిందంతోనూ నేను అంతగా కనెక్ట్ అయ్యాను.

బన్నీకి కథ నచ్చింది…

బన్నీతో సినిమా ఇప్పుడే చేయను. అయితే ‘గీత గోవిందం’ కథ ఆయనకు నచ్చింది. ‘సరైనోడు’ విడుదలైన తర్వాత ఆయనకు ఈ కథ చెప్పాను. దాంతో ఈ కథను మిస్ అవకుండా గీతాఆర్ట్‌లో చేయండి అని అన్నారు. సినిమా హిట్ అయిన తర్వాత ఆయన పెద్ద పార్టీ కూడా ఇచ్చారు.

బ్రదర్‌లాగా చూసేవారు…

నేను ‘పరుగు’ సినిమాకు భాస్కర్ దగ్గర పనిచేసేటప్పటి నుండి బన్నీవాసుతో పరిచయం ఉంది. అప్పటి నుంచి రెండు, మూడు నెలలకు ఓసారి వాసుతో మాట్లాడేవాడిని. ఆయన నన్ను ఓ బ్రదర్‌లాగా చూసేవారు.

Comments

comments