Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

గీత గోవిందం ఫ‌స్ట్ లుక్ రిలీజ్

githaa-govidham-frist

టాలీవుడ్: పరుశురామ్ దర్శకత్వంలో ‘గీతా ఆర్ట్స్2’ బ్యానర్ పై బన్నీవాసు నిర్మిస్తోన్న సినిమా ”గీత గోవిందం”. విజయ్ దేవరకొండ రష్మిక మందన కాంబినేషన్ లో ఈ సిన్మా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కొద్దిసేపటి కిందటే ఈ సిన్మాలోని ఫస్ట్ లుక్ పోస్టర్ ను విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ ఒక గోడకు ఆనుకొని, మరో గోడకి తన కాళ్లను ఆనించి ఉంచాడు. హీరో కాళ్లపై హీరోయిన్ కూర్చొని తనసంతోషాన్నికనబరుస్తోంది. ఆమె కళ్లలోకి చూస్తూ కథానాయకుడు ఆనందంలో పొంగిపోతున్నదృశ్యం యూత్ ను ఆకట్టుకుంటుంది. నా కాళ్లు తిమ్మిరెక్కినా నడుము నొప్పిలేచినా … మీ బరువు బాధ్యతలు ఎప్పుడూ నావే మేడమ్ అంటూ ఈ పోస్టర్ లోని స్టిల్ కి తగినట్టుగా విజయ్ దేవరకొండ తన ట్వీట్టర్ ద్వారా తెలియజేశాడు.

Comments

comments